సంధిగ్దతలో మార్కెట్లు? బలహీనంగా గ్లోబల్ సూచీలు

దేశీయంగా, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ప్రతికూలతల నేపథ్యంలో ఈ రోజు మార్కెట్లు స్తబ్దుగా కదిలాడే అవకాశాలున్నాయి. కరోనా భయాలు ఇన్వెస్టర్లను వెంటాడుతున్నాయ్. దీంతో విదేశీ ఇన్వెస్టర్లుతో పాటు దేశీయ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు.  అదే విధంగా నిఫ్టీ ఫార్మా, మీడియా షేర్లు మినహాయించి మిగతా అన్ని రంగాల షేర్లలో అమ్మకాల జోరు కొనసాగుతుంది. అలాగే గ్లోబల్ గా కమొడిటీ ధరలు గరిష్ఠ స్థాయికి చేరడంతో మెటల్ షేర్లలో లాభాల స్వీకరణ జరుగుతుంది. ఇదిలా వుంటే సింగపూర్ నిఫ్టీ నిన్నటి ట్రేడింగ్ సెషన్లో 200పైగా కోల్పోయి మళ్ళీ కనిష్ఠ స్థాయిల వద్ద మద్దతు తీసుకొని 14,684 వద్ద నష్టాల్లో ట్రేడ్ అవుతుంది.

 ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

Automotive AxleBalkrishna IndChola Fin Hold
CiplaDr Reddys LabsEscorts
Indigo PaintsJindal StainlesJust Dial
L&TReliance InfraRossari
SKF IndiaWelspun IndiaTAEL

 

న్యూస్ స్టాక్స్:

వేదాంత: ప్రముఖ మైనింగ్ సంస్థ వేదాంత లిమిటెడ్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో 95% శాతం పెరిగి క్వార్టర్-ఆన్-క్వార్టర్ (QoQ) నికర లాభం 6,432 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. మార్చి 31, 2021 (ఎఫ్‌వై 21) తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో (YoY) వేదాంత నికర లాభం రూ .11,712 కోట్ల రూపాయలు.

పిరమల్ ఎంటర్ప్రైజెస్: పిరమల్ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్ మార్చితో ముగిసిన త్రైమాసికంలో (క్యూ 4 ఎఫ్‌వై 21) రూ .748 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఈ సందర్భంగా పిరమల్ ఎంటర్ప్రైజెస్ బోర్డు ఒక్కో షేరుకు రూ.33 డివిడెండ్ సిఫార్సు చేసింది.

లూపిన్: ప్రముఖ ఫార్మా కంపెనీ లూపిన్ మార్చితో ముగిసిన త్రైమాసికంలో (క్యూ 4 ఎఫ్‌వై 21) కంపెనీ నికర లాభం రూ .460 కోట్లకు 18% పెరిగింది. ఈ సందర్భంగా కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు రూ .6.5 డివిడెండ్‌ను ప్రకటించింది.

పిడిలైట్ ఇండస్ట్రీస్: మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో పిడిలైట్ ఇండస్ట్రీస్ ఏకీకృత నికర లాభం రూ .307.44 కోట్లకు 96.4 శాతం పెరిగింది. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం 0.4 శాతం పెరిగి 1,126.13 కోట్లకు చేరుకుంది. ఈ సందర్భంగా కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు రూ .8.5 డివిడెండ్ ప్రకటించింది.

ఐఇఎక్స్: ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ (ఐఇఎక్స్) నికర లాభంలో 33% వృద్ధిని నమోదు చేసి లాభం రూ .60.85 కోట్లకు చేరుకుంది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

L&T, Lupin, Cipla, IEX, Pidilite Industries, Vedanta, HCC

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 32,366, రెసిస్టెన్స్ లెవెల్ 33,670 గా పరిగణించాల్సి వుంటుంది. అదే విధంగా నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14,420 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,044 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

దేశీయంగా, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు లేకపోవడంతో గ్లోబల్ సూచీలు నిరాశగా ట్రేడవుతున్నాయి కాబట్టి మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *