సందిగ్ధతలో మార్కెట్లు? నష్టాల్లో గ్లోబల్ సూచీలు

అంతర్జాతీయంగా ప్రతికూలతల నేపథ్యంలో నిన్నటి మార్కెట్ కాన్సాలిడేషన్ లో సూచీలు నష్టాల్లో ముగిశాయి. గరిష్ఠ స్థాయిల్లో ట్రేడ్ అవుతున్న షేర్లలో అమ్మకాలతో మదుపరుల లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ఈ వారంలో దేశీయంగా ఎటువంటి సానుకూలతలు లేని కారణంగా అంతర్జాతీయంగా అందే సంకేతాలే కీలకం కానున్నాయి.  అలాగే ప్రపంచ బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 8.3 శాతం అంచనా వేయడంతో దీని ప్రభావం మార్కెట్ పై వుండే అవకాశాలున్నాయి. అంతర్జాతీయంగా గురువారం యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ పాలసీ సమావేశం జరగనుంది. అలాగే అమెరికాలో కన్సూమర్ డేటా మరియు ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనుండటంతో యూఎస్ మార్కెట్ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. వీటిపై ఆదారపడే అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లు, ఆర్థిక వ్యవస్థపై నిర్ణయాలను గురువారం వెల్లడించనుంది. దీంతో ఈ మార్కెట్లు సందిగ్ధతలో సూచీలు కదలాడుతూ స్వల్ప లాభాల్లో ట్రేడ్ అయ్యే అవకాశాలున్నాయి.

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

Bajaj HealthcareBata IndiaBCL Industries
GAILGSS InfotechMunjal Auto Ind

న్యూస్ స్టాక్స్:

మాక్స్ ఫైనాన్షియల్: మాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ మార్చి 2021 (క్యూ 4 ఎఫ్‌వై 21) తో ముగిసిన త్రైమాసికంలో రూ .62.34 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 179.6 శాతం పెరిగి సంస్థ ఆదాయం రూ .405.39 కోట్లకు చేరుకుంది.

సువెన్ ఫార్మా: మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ.83.12 కోట్లకు 12.05 శాతం పెరుగుదలను సువెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 14.30% పెరిగి 362.34 కోట్లకు కంపెనీ ఆదాయం చేరుకుంది. కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు 1 రూపాయల తుది డివిడెండ్‌ను ప్రకటించింది.

వెల్స్‌పన్ : ఆస్ట్రేలియాకు చెందిన బరోస్సా ఆఫ్‌షోర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కొరకు వెల్‌స్పన్ కార్ప్ సుమారు 164 సుమారు రూ.1,725 ​​కోట్ల రూపాయల విలువ చేసే ఆర్డర్లను దక్కించుకుంది.

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

MOIL, Welspun, Astra Microwave, Inox leisure, NIIT.

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 34,930, రెసిస్టెన్స్ లెవెల్ 35,240 గా పరిగణించాల్సి వుంటుంది. అదే విధంగా నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 15,670 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,790 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లు ఫ్లాట్ గా నష్టాల్లో ముగిశాయి కాబట్టి మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

సందిగ్ధతలో మార్కెట్లు? నష్టాల్లో గ్లోబల్ సూచీలు

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *