వాలటల్టీ దిశగా సూచీలు? బలహీనంగా గ్లోబల్ మార్కెట్లు

దేశీయ, అంతర్జాతీయ సానుకూలతలతో నిన్నటి ట్రేడింగ్ లో నిఫ్టీ తాజా గరిష్ఠాలను నమోదు చేసింది. దేశీయంగా లాక్ డౌన్ లు విరమించే దిశగా రాష్ర్టాలు యోచన చేస్తుండటం, కరోనా మూడో దశలో కూడా ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉంటుందనే నమ్మకంతో మదుపరులు పెట్టుబడులు పెడుతుండటంతో మార్కెట్ బుల్ ట్రెండ్ నే కొనసాగిస్తుంది. ఇక అంతర్జాతీయంగా అమెరికా ఫెడ్ నిర్ణయాలు రేపు వెలువడనుండటంతో పాటు రేపు (గురువారం) విక్లీ ఎక్సపయిరీ ఉండటంతో ఈ రోజు మదుపరులు అప్రమత్తతో ఉండే అవకాశం వుంది. అదే విధంగా ప్రపంచ మార్కెట్లు సైతం నిన్నటి ట్రేడింగ్ లో నష్టాల్లో ముగిశాయి కాబట్టి ఈ రోజు  సూచీలు ఒడుదుడుకుల మధ్య నష్టాల్లో ట్రేడ్ అయ్యే అవకాశాలున్నాయి.

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

Ashok Alco-ChemWelspun EnterInd & Prud Invt
Kakatiya CementRITESSomany Ceramics

 

న్యూస్ స్టాక్స్:

జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్: మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ లిమిటెడ్ నికర లాభం 395.5% పెరిగి 104.3 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ సందర్భంగా కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు 6 రూపాయల తుది డివిడెండ్‌ను ప్రకటించింది.

ఈజీ ట్రిప్ ప్లానర్స్: ఈజీ ట్రిప్ ప్లానర్స్ లిమిటెడ్ మార్చితో ముగిసిన త్రైమాసికంలో (క్యూ 4 ఎఫ్‌వై 21) నికర లాభం రూ .30.46 కోట్లు ఆర్జించింది. మార్చి 31, 2021 (ఎఫ్‌వై 21) తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 84.99% పెరిగి సంవత్సర ఆదాయం 61.01 కోట్ల రూపాయలకు చేరుకుంది.

ఎల్‌ఐసి హౌసింగ్ ఫైనాన్స్: మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 5.33 శాతం తగ్గి రూ.398.9 కోట్లకు పరిమితమైంది.  మార్చి 2021 లో కంపెనీ రుణ పోర్ట్‌ఫోలియో 10% పెరిగి రూ .2.16 లక్షల కోట్లకు పెరిగింది. ఈ సందర్భంగా ఎల్‌ఐసి హౌసింగ్ ఫైనాన్స్ బోర్డు ఒక్కో షేరుకు రూ .8.50 డివిడెండ్‌ను సిఫారసు చేసింది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Jubilant Foodworks, Ashok Leyland, LTI, WIPRO, Lupin

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 35,160, రెసిస్టెన్స్ లెవెల్ 35,510 గా పరిగణించాల్సి వుంటుంది. అదే విధంగా నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 15,780 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,90వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లు ప్రతికూలంగా నష్టాల్లో ముగిశాయి కాబట్టి మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *