లాభాల పరంపర కొనసాగుతుందా? సానుకూలంగా గ్లోబల్ మార్కెట్స్

గత వారం దేశీయ, అంతర్జాతీయ సానుకూలతలతో మార్కెట్లు ఆల్ టైం హైలో సూచీలు ముగిశాయి. ఈ వారం కూడా మార్కెట్లకు సానుకూల పవనాలే కనపిస్తున్నాయి. దేశీయంగా అన్ లాక్ దిశగా రాష్ట్రాలు నిబంధనలు సడలించి దశల వారీగా ప్రజాజీవనానికి అనుమతులిస్తుండటం, కరోనా ముగిసేంత వరకు పాలసీ విధానాల్లో ఎటువంటి మార్పులు వుండవని రిజర్వు బ్యాంక్ స్పష్టం చేయడం మార్కెట్ ర్యాలీని ప్రొత్సహించే విధంగా ఉన్నాయి. ఇదిలా వుంటే గత వారంలో విదేశీ ఇన్వెస్టర్లు సుమారు 5,462 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయడం గమనార్హం. వీటన్ని దృష్ట్యా మార్కెట్లో భారీ ర్యాలీ రానప్పటికీ తటస్థంగా సూచీలు లాభాల్లో కదలాడే అవకాశాలున్నాయి. ఇక అంతర్జాతీయంగా అమెరికాలో మే నెలకు సంబంధించిన జాబ్ డేటా వెలువడనున్న నేపథ్యంలో అంచనాలకు తగ్గట్టుగా సుమారు 5.5 లక్షల ఉద్యోగాల సృష్టి ఉండబోతున్న వార్తలతో ఐటీ షేర్లలో ర్యాలీ కొనసాగి యూస్ మార్కెట్లు రికార్డ్ హైలో ముగిశాయి. వీటి ప్రభావంతో ఈ రోజు మార్కెట్లు సానుకూలంగా లాభాల్లో ట్రేడ్ అయ్యే అవకాశాలున్నాయి.

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

Bectors FoodCentral BankDynamatic Tech
Jubilant IngrevMRFSMS Lifescience
Union BankBSLAmines Plast

 

న్యూస్ స్టాక్స్:

రైల్‌టెల్: భారత్ కోకింగ్ బొగ్గు నుండి 120 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్‌ను రైల్‌టెల్ కార్ప్ భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బిసిసిఎల్) నుండి 119.72 కోట్ల రూపాయల ఆర్డర్‌ను పొందింది.

బ్యాంక్ ఆఫ్ ఇండియా: మార్చి 2021 (క్యూ 4 ఎఫ్‌వై 21) తో ముగిసిన త్రైమాసికంలో రూ .250.19 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ రూ .2,160.3 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.

మోయిల్: ప్రభుత్వ రంగ సంస్థ మోయిల్ మార్చి (Q4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 125.83% క్వార్టర్-ఆన్-క్వార్టర్ (QoQ) నికర లాభం 116.03 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 761% పెరిగింది. MOIL కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు రూ .4.9 తుది డివిడెండ్‌ను ప్రకటించింది.

భారత్ ఫోర్జ్: ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ భారత్ ఫోర్ట్ మార్చి 2021 (క్యూ 4 ఎఫ్‌వై 21) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ .212.12 కోట్లు ఆర్జించింది. క్యూ 4 ఎఫ్‌వై 21 లో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 16.36 శాతం పెరిగి రూ .2,082.85 కోట్లకు ఆదాయం పెరిగింది. ఈ సందర్భంగా కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు రూ.2 చొప్పున తుది డివిడెండ్‌ను సిఫారసు చేసింది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

PowerGrid, MOIL, RailTel, Bank of India, Bharat Forge, Tata Consumer.

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 35,110, రెసిస్టెన్స్ లెవెల్ 35,530 గా పరిగణించాల్సి వుంటుంది. అదే విధంగా నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 15,630 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,740 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో సానుకూలంగా ముగిశాయి కాబట్టి మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *