లాభాలకు బ్రేక్…నష్టాలు కొనసాగుతాయా?

వరుస లాభాల్లో కొనసాగుతున్న మన మార్కెట్లకు నిన్నటి ట్రేడింగ్ లో నష్టాలు ఎదురయ్యాయి.  జాతీయంగా, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో నిన్నటి ట్రేడింగ్ సెషన్లో నిఫ్టీ 91 పాయింట్లు కోల్పోగా సెన్సెక్స్ 340 పాయింట్లు కోల్పోయాయి. ఇదే నష్టాల పోరు ఈ రోజు కూడా తప్పేట్లు లేదు.  దీనికి ప్రధాన కారణాలుగా గ్లోబల్ రేటింగ్ సంస్థలు భారత వృద్ధి రేటు అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారీగా తగ్గించడం, భారత్ లో కొత్త రకం వైరస్ కారకాలు తీవ్రంగా వ్యాపించడం కారణాలుగా చెప్పుకోవచ్చు.  దీంతో పాటు తగిన వైద్య సదుపాయాలు లేకపోవడంతో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఇదిలా వుంటే అంతర్జాయంగా ఇజ్రాయేల్, గాజా మధ్య యుద్ధ వాతావరణం అలుముకుంది. అదే విధంగా అంతర్జాతీయ మార్కెట్లు సైతం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అయితే ఈ రోజు దిగ్గజ కంపెనీలు ఏషియన్ పెయింట్స్, యూపిఎల్, లూపిన్ తదితర కంపెనీల త్రైమాసిక ఫలితాలు వెలువడనుండడంతో సూచీలు హెచ్చు, తగ్గుల మధ్య ముగిసే అవకాశాలున్నాయి.

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

Apollo TyresUPLLupin
Asian PaintsBirla CorpGRM Overseas
Happiest MindsHG Infra EnggJindal Steel
Pidilite IndPrince PipesTata Power
VoltasSagar CementKaycee Ind

 

న్యూస్ స్టాక్స్:

గోద్రేజ్ కన్స్యూమర్: గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (జిసిపిఎల్) మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ.365.84 కోట్లకు 59.13% శాతానికి ఆదాయం ఆర్జించింది.

JSW హైడ్రో ఎనర్జీ: జెఎస్‌డబ్ల్యు ఎనర్జీ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ జెఎస్‌డబ్ల్యు హైడ్రో ఎనర్జీ ఆఫ్‌షోర్ బాండ్ల జారీ ద్వారా 707 మిలియన్ డాలర్లు (5,185 కోట్ల రూపాయలు) నిధులను సేకరించింది. వీటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని కంపెనీ చేపట్టిన హైడ్రో ప్రాజక్టులపై ఖర్చు చేయనుంది.

గ్రాన్యూల్స్ ఇండియా: మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ఏకీకృత నికర లాభం 38.15% పెరిగి రూ .127.6 కోట్లకు పెరిగింది. ఈ సందర్భంగా కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు రూ. 0.75 డివిడెండ్‌ను ప్రకటించింది.

సిమెన్స్: మార్చితో ముగిసిన త్రైమాసికంలో (క్యూ 2 ఎఫ్‌వై 21) నికర లాభం రూ.334.4 కోట్లతో 90.3 శాతం పెరుగుదలను కంపెనీ కనబరిచింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఇది 16.9 శాతం ఎక్కువ లాభాలను కంపెనీ ఆర్జించింది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

JSW Steel, JSW Energy, UPL, Jindal Steel, Voltas, Lupin, Apollo Tyres, Siemens.

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 32,672, రెసిస్టెన్స్ లెవెల్ 33,086 గా పరిగణించాల్సి వుంటుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14,765 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,051 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

అంతర్జాతీయంగా సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నప్పటికీ దిగ్గజ కార్పొరేట్ కంపెనీ ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో సూచీలు హెచ్చు, తగ్గుల మధ్య ట్రేడ్ అయ్యే అవకాశాలున్నాయి కాబట్టి మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *