రికార్డ్ హై లో మార్కెట్లు…మార్కెట్ గాప్ అప్?

ఈ రోజు నిఫ్టీ గరిష్ఠ స్థాయిల వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలున్నాయి. జాతీయ, అంతర్జాతీయ సానుకూలతల నేపథ్యంలో మార్కెట్లు దూసుకుపోనున్నాయి. కరోనా నివారణకు అడ్డుకట్ట పడుతుండటంతో సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో మదుపర్లకు క్రొత్త ఆశలు రేకిస్తున్నాయి. అలాగే కరోనా మరణాల రేటును తగ్గించే విధంగా సిప్లా కంపెనీ యాంటీ బాడీ కాక్ టెయిల్ మార్కెట్లోకి విడుదల చేయడంతో పాటు రకరకాల వ్యాక్సిన్లు, ఔషధాలు మార్కెట్లోకి అందుబాటులోకి రావడంతో సాధారణ పరిస్థితులు దిశగా ప్రపంచం కదులుతుంది.  ఈ సానుకూలతల మధ్య నిఫ్టీ ఆల్ టైమ్ హైలో రికార్డులు తిరగరాసే దిశగా దూసుకుపోయే అవకాశాలు లేకపోలేదు. ఇకపోతే సింగపూర్ నిఫ్టీ 150 పాయింట్ల లాభంతో 15,342 వద్ద ట్రేడ్ కొనసాగుతుంది.

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

Ajmera RealtyAlkem LabAnjani Cement
AstraZenecaBajaj ElectricEmami
GatiGoldiam InterIndoco Remedies
Johnson ControlLa Opala RGLaxmi Organic
TVS SrichakraVIP IndustriesRamco System

 

న్యూస్ స్టాక్స్:

గ్రాసిమ్: ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో 13.3% శాతం నికర లాభం తో రూ.2,616.64 కోట్లకు పెరిగింది. మార్చి 31, 2021 (ఎఫ్‌వై 21) తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 5.24 శాతం పెరిగి రూ .6,986.70 కోట్లకు చేరుకుంది. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ బోర్డు ఒక్కో షేరుకు రూ .9 డివిడెండ్ ప్రకటించింది.

జైడస్ కాడిలా: ‘ఉజ్వీరా’ బ్రాండ్ పేరుతో ప్రారంభ దశలో వున్న పాజిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు చికిత్స చేయడానికి యాంటీబాడీ-డ్రగ్ కంజుగేట్ (ADC) బయోసిమిలర్ మరియు ట్రాస్టూజుమాబ్ ఎమ్టాన్సిన్ ఔషధాన్ని మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు జైడస్ కాడిలా ప్రకటించింది.

రామ్‌కో సిమెంట్స్: రామ్‌కో సిమెంట్స్ లిమిటెడ్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ.216.16 కోట్లతో 51.08 శాతం పెరిగింది. మార్చి 31, 2021 (ఎఫ్‌వై 21) తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ నికర లాభం 29.71 శాతం పెరిగి 783.64 కోట్ల రూపాయలకు చేరుకుంది.

బాలాజీ అమైన్స్: ప్రముఖ రసాయనాల తయారీ సంస్థ బాలాజీ అమైన్స్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభంలో రూ .84.50 కోట్లకు 174.17 శాతం వృద్ధిని నమోదు చేసింది. మార్చి 31, 2021 (ఎఫ్‌వై 21) తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 127.28 శాతం పెరిగి రూ .258.03 కోట్లకు చేరుకుంది. ఈ సందర్భంగా కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు రూ .4 డివిడెండ్‌ను ప్రకటించింది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

BPCL,GRASIM,ITC, Berger Paints, KIOCL, la opala rg, Emami, CIPLA, Bajaj Electronics

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 34,527, రెసిస్టెన్స్ లెవెల్ 35,250 గా పరిగణించాల్సి వుంటుంది. అదే విధంగా నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 15,138 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,285 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

దేశీయంగా, అంతర్జాతీయంగా సానుకూలతల నేపథ్యంలో సూచీల్లో అప్ ట్రెండ్ కొనసాగే అవకాశాలున్నాయి కాబట్టి మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *