రికార్డ్ హై లో అమెరికా మార్కెట్లు…బుల్ ట్రెండ్ కొనసాగుతుందా?

దేశీయంగా, అంతర్జాతీయంగా అందిన సంకేతాలతో నిన్నటి ట్రేడింగ్ లాభాల్లో ముగిసింది. ఇన్పోసిస్ షేర్ల బైబ్యాక్ ప్రకటించడం, దేశీయంగా బిపివో రంగంలో కేంద్రం సానుకూల నిర్ణయాలతోపాటు దిగ్గజ ఐటీ కంపెనీ అసెంచర్ మెరుగైన క్యూ 3 ఫలితాలు ప్రకటించడంతో ఐటీ షేర్లు దమ్ము రేపాయి. ఇక అమెరికాలో ఎకానమీ రికవరీ పడుతుండటంతోపాటు ఆర్థిక వ్యవస్థను మరింత ముందుకు తీసుకెళ్ళేందుకు 559 బిలియన్ డాలర్లు (40 లక్షల కోట్లు) కేటాయించడంతో అమెరికా మార్కెట్లు రికార్డ్ హైలో ముగియడంతోపాటు ఆసియా, యూరప్ మార్కెట్లు సైతం లాభాల్లోనే ముగిశాయి. ఈ రోజు సింగపూర్ నిఫ్టీ లాభాల నుంచి నష్టాల్లో ట్రేడ్ అవుతుండటంతో మన మార్కెట్లో సూచీలు కాన్సాలిడేషన్ జోన్లో ట్రేడ్ అయ్యే అవకాశాలున్నాయి. అదే విధంగా మార్కెట్ కు రెండు రోజుల (శని, ఆది) విరామం ఉండటంతో గరిష్ఠ స్థాయిల్లో లాభాల స్వీకరణ కూడా జరిగే అవకాశాలు లేకపోలేదు.

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

AlphageoAntony WasteAtul Auto
CSL FinHind CopperIGL
India GlycolsInox Wind EnergLykis

 

న్యూస్ స్టాక్స్:

రిలయన్స్ ఇండస్ట్రీస్: రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రీన్ ఎనర్జీ వ్యాపారంలో అడుగుపెట్టనున్నట్లు నిన్న జరిగిన ఎజీఎం మీటింగ్లో కంపెనీ ప్రకటించింది. రాబోయే మూడేళ్లలో సుమారు రూ .75,000 కోట్ల పెట్టుబడితో 5000 ఎకరాల్లో పర్యావరణ సంబంధిత గ్రీన్ ఎనర్జీలో నాలుగు గిగా ప్రాజెక్టులు నిర్మించినున్నట్లు కంపెనీ తెలిపింది.

జైడస్ కాడిలా: ప్రముఖ ఫార్మా కంపెనీ జైడస్ కాడిలా తయారు చేసిన జెనరిక్ స్క్లెరోసిస్ ఔషధానికి యుఎస్‌ఎఫ్‌డిఎ అనుమతి లభించింది. దీన్ని మెదడు సంబంధిత వ్యాధుల నివారణకు దీన్ని ఉపయోగించనున్నారని కంపెనీ ఒక ప్రకటనలోతెలిపింది.

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

HFCL, Reliance, IGL, Lykis, Antony Waste, Indian Bank, Adani Enterprises.

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 34,670, రెసిస్టెన్స్ లెవెల్ 35,090 గా పరిగణించాల్సి వుంటుంది. అదే విధంగా నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 15,720 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,860 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *