రికార్డుల పర్వం కొనసాగుతుందా? శిఖరాగ్ర స్థాయికి నిఫ్టీ?

గత వారం వరుస లాభాలతో నిఫ్టీ గరిష్ఠ స్థాయిలు వద్ద ట్రేడ్ అయ్యి మదుపరులను ఉత్సాహపరిచింది. ఈ వారం కూడా ఇదే జోరు కొనసాగే అవకాశాలున్నాయి. దేశీయంగా సానుకూల అంశాలుగా కరోనా కేసుల తగ్గడంతో లాక్డౌన్లు ఎత్తివేసే దిశగా రాష్ట్రాలు చర్యలు తీసుకోవడం, ఆర్ బీ ఐ ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి పాలసీ సమావేశేం జూన్ 2వ తేదీన జరుగనున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ ముందుకు నడిపించే విధంగా సానుకూల నిర్ణయాలు వెలువడే అవకాశాలువుండటం, అలాగే ఈ వారంలో  ప్రముఖ కార్పొరేట్ కంపెనీల ఫలితాలు వెల్లడి కావడం వంటివి సానుకూల అంశాలుగా పరిగణించవచ్చు. ఇక అంతర్జాతీయంగా అగ్రరాజ్యం అమెరికాలో నిరుద్యగో రేటు తగ్గి ఉద్యోగ కల్పన రేటు పెరగడంతోపాటు ఈ దఫా రూ.430 లక్షల కోట్ల భారీ బడ్జెట్ ను ప్రకటించనున్నట్లు స్పష్టం చేసింది. దేశీయంగా, అంతర్జాతీయంగా సానుకూల పరిణామల దృష్ట్యా ఈ రోజు మన మార్కెట్లు గ్రీన్ లో ముగిసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

Apar IndAurobindo PharmHoneywell Autom
Narayana HrudaShilpaTRF

 

న్యూస్ స్టాక్స్:

ఎం అండ్ ఎం: మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం), మహీంద్రా వెహికల్ మాన్యుఫ్యాక్చరింగ్ లిమిటెడ్ (ఎంవిఎంఎల్) మార్చితో ముగిసిన త్రైమాసికంలో (క్యూ 4 ఎఫ్‌వై 21) కలిపి రూ.163 కోట్ల నికర లాభాన్ని ఆర్జించాయి. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం 48% పెరిగి 13,338 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ సందర్భంగా కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు రూ .8.75 తుది డివిడెండ్ ప్రకటించింది.

వేదాంత: వేదాంత లిమిటెడ్ ఒడిశాలో రూ. 10,000 వేల కోట్ల పెట్టుబడితో అల్యూమినియం పార్కును ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా సుమారు 1 లక్ష మందికి పైగా ఉపాధి అవకాశాలను పొందే అవకాశం వున్నట్లు వేదాంత పేర్కొంది.

అఫ్లే ఇండియా: మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 282% పెరిగి రూ.58.5 కోట్లకు చేరుకుంది. గడిచిన త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 90% పెరిగింది. మార్చి 31, 2021 (ఎఫ్‌వై 21) తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ నికర లాభం 105% పెరిగి ఆదాయం 134.80 కోట్ల రూపాయలకు చేరుకుంది.

గ్లెన్మార్క్ ఫార్మా: గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ .233.87 కోట్లకు 6.15% పెరిగింది. మార్చి 31, 2021 (ఎఫ్‌వై 21) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 25% పెరిగి సంస్థ ఆదాయం 970 కోట్లకు చేరుకుంది. ఈ సందర్భంగా కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు రూ .2.5 డివిడెండ్ ప్రకటించింది.

దివి లాబొరేటరీస్: దిగ్గజ ఫార్మా కంపెనీ దివిస్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ.502.02 కోట్ల ఆదాయం ఆర్జించింది. మార్చి 31, 2021 (ఎఫ్‌వై 21) తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 44.15 శాతం పెరిగి 1,984.29 కోట్లకు చేరుకుంది. ఈ సందర్భంగా దివి ల్యాబ్స్ బోర్డు ఒక్కో షేరుకు రూ .20 తుది డివిడెండ్ ప్రకటించింది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Affle India, Ipca Labs, Vedanta, M&M, Dhanlaxmi Bank, Divis Labs

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 35,053 రెసిస్టెన్స్ లెవెల్ 35,635 గా పరిగణించాల్సి వుంటుంది. అదే విధంగా నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 15,397 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,503 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

దేశీయంగా మరియు అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలున్నాయి కాబట్టి మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *