మార్కెట్ వాలటల్టీ… సెల్లింగ్ కొనసాగుతుందా?

అంతర్జాతీయ ప్రతికూలతల నేపథ్యంలో మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరిగి నిన్నటి ట్రేడింగ్ సెషన్లో మార్కెట్ నష్టాల్ని చవిచూసింది. మార్కెట్ ఆరంభంలో నిఫ్టీ లాభాల్లో కొనసాగినప్పటికీ ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతుండటంతో మిడ్ సెషన్ నుంచి లాభాల స్వీకరణతో అమ్మకాలు కొనసాగాయి. దీనికి ప్రధాన కారణాలుగా దేశీయంగా ఎటువంటి సానుకూల అంశాలు లేకపోవడం, రేపటి నుంచి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ పాలసీ సమావేశం జరుగుతుండటంతో పాటు అగ్రరాజ్యం అమెరికాలో ద్రవ్యోల్బణ గణాంకాలు గురువారం వెల్లడి కానుండటంతో మదుపరులు అప్రమత్తతో వ్యవహరిస్తూ గరిష్ట స్థాయిల్లో ట్రేడ్ అవుతున్న షేర్లలో అమ్మకాలు చేపట్టారు. అదే విధంగా నిన్నటి ట్రేడింగ్ లో దేశీయ, విదేశీ ఇన్వెస్టర్లు మొత్తం కలిపి రూ.2,473 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను అమ్మేశారు. ఈ పరిస్థితుల దృష్ట్యా గ్లోబల్ మార్కెట్లు కూడా నష్టాల్లో ముగిశాయి. ఇదిలా వుంటే ఈ రోజు ఆసియా మార్కెట్లు లాభాల్లో ఆరంభమవ్వడం గమనార్హం. దీంతో జపాన్, షాంఘై మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా అందుకున్న సంకేతాలతో సింగపూర్ నిఫ్టీ నష్టాల్లో మొదలైనప్పటికీ 32 పాయింట్ల లాభంతో sgxనిఫ్టీ 15,704 వద్ద ట్రేడ్ కొనసాగుతుంది. ఈ రోజు మన మార్కెట్లో సూచీలు తీవ్ర ఒడుదుడుకుల మధ్య కదలాడుతో నష్టాల్లో ముగిసే అవకాశాలున్నాయి.

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

Alkali MetalsAmbika CottonAnjani Finance
Bee-am ChemicalCera SanitaryCineline India
GE T&D IndiaHarrisons MalayNFL
NHPCSAILUnited Nilgiri

 

న్యూస్ స్టాక్స్:

గెయిల్: గెయిల్ (ఇండియా) లిమిటెడ్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో 28 శాతం క్వార్టర్ ఆన్ క్వార్టర్ (క్యూక్యూ) నికర లాభంతో రూ .1907 కోట్లకు ఆదాయం పెరిగింది. అయితే 2020-21 (ఎఫ్‌వై 21) ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 26% తగ్గి 4,890.18 కోట్లకు ఆదాయం పరిమితమైంది.

పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జి: పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జి కంపెనీ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 71 శాతం పెరిగి 638 కోట్ల రూపాయలకు పెరిగింది. మార్చి 31, 2021 (ఎఫ్‌వై 21) తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 8.7 శాతం పెరిగి రూ .2,939.23 కోట్లకు చేరుకుంది. పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జి బోర్డు ఒక్కో షేరుకు 3.5 రూపాయల తుది డివిడెండ్‌ను ప్రకటించింది.

బజాజ్ హెల్త్‌కేర్: మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 70 శాతం పెరిగి 21.28 కోట్ల రూపాయలకు చేరుకుంది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 19.45% తగ్గింది. బజాజ్ హెల్త్‌కేర్ బోర్డు ఒక్కో షేరుకు తుది డివిడెండ్‌ను 0.5 రూపాయలు, ఒక్కో షేరుకు 0.5 రూపాయల ప్రత్యేక డివిడెండ్‌ను సిఫార్సు చేసింది.

ఇండియన్ మెటల్స్: ఇండియన్ మెటల్స్ అండ్ ఫెర్రో అల్లాయ్స్ లిమిటెడ్ మార్చి 2021 (క్యూ 4 ఎఫ్‌వై 21) తో ముగిసిన త్రైమాసికంలో రూ .65.4 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో (క్యూ 4 ఎఫ్‌వై 20) రూ .51.94 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. క్యూ 4 ఎఫ్వై 21 లో మొత్తం ఆదాయం 54.31% YOY (లేదా 36.7% QoQ) పెరిగి 587.95 కోట్లకు చేరుకుంది. మార్చి 31, 2021 (ఎఫ్‌వై 21) తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 350.5 శాతం పెరిగి 166.55 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ సందర్భంగా కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు 7 రూపాయల డివిడెండ్‌ను ప్రకటించింది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Indian Metals, Cera Sanitary, SAIL, LT Foods, Pertronet LNG, Indian Metals.

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 34,710, రెసిస్టెన్స్ లెవెల్ 35,210 గా పరిగణించాల్సి వుంటుంది. అదే విధంగా నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 15,590 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,700 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

అంతర్జాతీయ ప్రతికూలతల నేపథ్యంలో మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *