మార్కెట్ యూటర్న్? గ్లోబల్ ఇండిసిస్ డౌన్.

ఇండియాన్ స్టాక్ మార్కెట్ సరికొత్త రికార్డును నిన్నటి ట్రేడింగ్ లో నెలకొల్పింది. దీంతో మదుపరుల సంపద రూ.226 కోట్ల రూపాయలకు ఎగబాకింది. గత మూడు రోజుల మార్కెట్ ను మనం గమనించినట్లయితే సూచీలు స్పల్ప తేడాలతో ఒకటే విధంగా కొనసాగుతూ…ముగింపులో కొనుగోళ్ళు చేస్తున్నారు. నిన్నటి రోజు కూడా గరిష్ఠ స్థాయిల వద్ద విదేశీ రూ.1079 కోట్ల విలువైన షేర్లను కొన్నారంటే మార్కెట్ మరింత ముందుకు వెళ్ళే అవకాశాలు లేకపోలేదు. అదే విధంగా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం కూడా ఎందుకంటే గరిష్ఠ స్థాయిల్లో లాభాల స్వీకరణ జరిగే అవకాశాలున్నాయి. అలాగే ఈ రోజు సింగపూర్ నిఫ్టీ నెగెటివ్ గా ఓపెన్ అయింది. ఇక దేశీయంగా ఫ్యాషన్ ఇండస్ట్రీ కుదేలావ్వడంతో ఈ రంగానికి సంబంధించిన షేర్లలో సెల్లింగ్ రావొచ్చు. గత ఎనిమిది నెలలుగా ఎటువంటి ఆర్డర్లు లేకపోవడంతో భారత సేవల రంగం పిఎంఐ ఇండెక్స్(ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజేర్స్ ఇండెక్స్) దిగజారింది. ఇదిలావుంటే అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. దీంతో ఈ రోజు మార్కెట్లో అమ్మకాలతో నష్టాల్లో ముగిసే అవకాశాలున్నాయి.

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

Bank of IndiaBharat ForgeIOL Chemicals
Jubilant PharmaMOILPNB

 

న్యూస్ స్టాక్స్:

అరవింద్ ఫ్యాషన్స్: మార్చి 2021 (క్యూ 4 ఎఫ్‌వై 21) తో ముగిసిన త్రైమాసికంలో అరవింద్ ఫ్యాషన్స్ లిమిటెడ్ రూ .99.45 కోట్ల నికర నష్టాన్ని నివేదించింది. అదేవిధంగా గడిచిన సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో (క్యూ 4 ఎఫ్‌వై 20) రూ.209.12 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది.

లుపిన్: ఇండియాలో డిజిటల్ హెల్త్‌కేర్ స్పేస్‌ అనే కొత్త సంస్థతో డిజిటల్ హెల్త్ కేర్ సేవలు అందిచనున్నట్లు ఫార్మా దిగ్గజం లుపిన్ తెలిపింది. ఈ డిజిటల్ హెల్త్‌కేర్ స్పేస్‌లో వైద్యులు మరియు రోగులకు డిజిటల్ థెరప్యూటిక్స్ ప్లాట్‌ఫామ్‌ను ఇవ్వడంపై దృష్టి సారించినట్లు తెలిపింది.

గుజరాత్ స్టేట్ పెట్రోనెట్: గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ సంస్థ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 8.82% పెరుగుదలను కనబరుస్తూ ఆదాయం రూ. 416.67 కోట్లకు పెరిగింది. 2020-21 (ఎఫ్‌వై 21) మొత్తం ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 7.08% తగ్గి 1,606.76 కోట్లకు పరిమితమైంది. కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు 2 రూపాయల డివిడెండ్‌ను ఇవ్వనున్నట్లు తెలిపింది.

నీల్ కమల్: మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 19.84 శాతం వృద్ధిని నికర లాభం 38.06 కోట్లకు పెరిగింది. అయితే 2020-21 (ఎఫ్‌వై 21) ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 20.52 శాతం తగ్గి 112.93 కోట్లకు పరిమితమైంది. కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు 10 రూపాయల తుది డివిడెండ్ ప్రకటించింది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Cadila Healthcare, Lupin, BEML, M&M

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 35,430, రెసిస్టెన్స్ లెవెల్ 35,850 గా పరిగణించాల్సి వుంటుంది. అదే విధంగా నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 15,605 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,760 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

రిజర్వ బ్యాంకు పాలసీ సమావేశం విధి, విధానాలు ఈ రోజు వెల్లడయ్యే అవకాశం వుంది అలాగే అంతర్జాతీయ మార్కెట్లు సూచీలు నష్టాల్లో ముగిశాయి కాబట్టి మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *