మార్కెట్ ‘పాజటివ్’… లాభాల జోరు కొనసాగుతుందా?

గత వారం మార్కెట్లు నష్టాలు – లాభాల మధ్య రికార్డు హై లో ముగిశాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఇక పై మార్కెట్లో బుల్ జోరు కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. దీనికి ప్రధాన కారణాలుగా దాదాపు అన్ని రంగాల కార్పొరేట్ కంపెనీల ఫలితాలు ఆకర్షణీమైన ఫలితాలు ప్రకటించడంతో పాటు కరోనా కేసులు తగ్గుదల కనపించడం, అగ్రరాజ్యం అమెరికాతో పాటు కొన్ని దేశాల్లో సాధారణ జీవన పరిస్థితులు నెలకొనడంతో మదుపరులలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఇదిలావుంటే దిగ్గజ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ మరోసారి రికార్డ్ ఫలితాలు నమోదు చేసింది. దీంతో బ్యాంకింక్ షేర్లలో ర్యాలీ కొనసాగవచ్చు. ఈ వారంలో నిఫ్టీ 15,500 మార్కును తాకే అవకాశాలున్నాయి. అలాగే ఈ రోజు కూడా మార్కెట్లు సూచీలు లాభాల్లో దూసుకుపోయే అవకాశాలున్నాయి.

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

ADF FoodsBalaji AminesBannariamman
Dalmia SugarGrasimIG Petro
India CementsJSW HoldingsMahanagar Gas
Poly MedicureRamco CementsSummit Sec

 న్యూస్ స్టాక్స్:

ఎస్బిఐ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ .6450.75 కోట్లతో 80.14% శాతం పెరిగింది. ఈ సందర్భంగా ఎస్బిఐ బోర్డు ఒక్కో షేరుకు రూ.4 డివిడెండ్ ప్రకటించింది.

జెఎస్‌డబ్ల్యు స్టీల్: జెఎస్‌డబ్ల్యు స్టీల్ లిమిటెడ్ మార్చితో ముగిసిన త్రైమాసికంలో (క్యూ 4 ఎఫ్‌వై 21) నికర లాభం రూ .4,198 కోట్లకు 56.5% క్వార్టర్-ఆన్-క్వార్టర్ (QoQ) పెరిగింది.

హిండాల్కో: మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో హిండాల్కో ఇండస్ట్రీస్ ఏకీకృత నికర లాభం 189% పెరిగి 1,928 కోట్ల రూపాయలకు చేరుకుంది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 2.7% పెరిగింది. హిండాల్కో బోర్డు ఒక్కో షేరుకు రూ.3 తుది డివిడెండ్ ప్రకటించింది.

శ్రీ సిమెంట్: ప్రముఖ సిమెంట్ కంపెనీ శ్రీ సిమెంట్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం రూ.798.43 కోట్లతో 48.98% పెరుగుదలను కనబరిచింది. మార్చి 31, 2021 (ఎఫ్‌వై 21) తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 48.83 శాతం పెరిగి ఆదాయం రూ.2,285.87 కోట్లకు చేరుకుంది. ఈ సందర్భంగా శ్రీ సిమెంట్ బోర్డు ఒక్కో షేరుకు 60 రూపాయల తుది డివిడెండ్‌ను ప్రకటించింది.

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Persistent Systems, SBI, Mangalam Cement, JSW Steel, Sunpharma, Hindalco, Amara Raja Batteries, Natco Pharma.

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 34,450, రెసిస్టెన్స్ లెవెల్ 35,019 గా పరిగణించాల్సి వుంటుంది. అదే విధంగా నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 15,060 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,220 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

దేశీయంగా, అంతర్జాతీయంగా సానుకూలతల నేపథ్యంలో సూచీల్లో అప్ ట్రెంట్ కొనసాగే అవకాశాలున్నాయి కాబట్టి మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *