మార్కెట్ గ్యాప్ డౌన్? నష్టాల్లో ఆసియా మార్కెట్లు

దేశీయ, అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో నిన్నటి ట్రేడింగ్ లో నిఫ్టీ లాభాల్లో ముగిసింది. అమెరికా ఫెడరల్ రిజర్వు ద్రవ్యపాలసీ నిర్ణయాలు సాసుకూలంగా వెలువడ్డాయి. ఫెడ్ నిర్ణయాల్లో ముఖ్యంగా కీలక వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు వుండబోదని, బాండ్ల కొనుగోళ్ళ ప్రక్రియ ఇప్పట్లో వుండదని ప్రకటించడంతో గ్లోబల్ మార్కెట్లు ఆశాజనకంగా ట్రేడయ్యాయి. దీంతో అమెరికా మార్కెట్లు గ్రీన్ లో మూగిసినప్పటకీ నాస్ డాక్ ఫ్యూచర్స్ మాత్రం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా మళ్ళీ కరోనా కేసులు పెరగడంతో మదుపరులు అప్రమత్తతో తమ పెట్టబడుల నిర్ణయాల్లో ముందుకు వెళ్ళే అవకాశాలున్నాయి. ఇదిలావుంటే ఈ రోజు జపాన్ టోక్యో, షాంఘై మార్కెట్ల సూచీలు నష్టాల్లో ఆరంభం అవ్వడంతో సింగపూర్ నిఫ్టీ సైతం ఒడుదుడుకుల మధ్య నష్టాల్లోనే ట్రేడ్ కొనసాగుతుంది.

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

Aditya Birla FBHELChola Invest.
Dr Lal PathLabExide IndustriesSun Pharma
IOCKEC IntlMarico
NazaraUPLPI Industries

 

న్యూస్ స్టాక్స్:

టెక్ మహీంద్రా: టెక్ మహీంద్రా లిమిటెడ్ 39.17% వృద్ధిని సాధించింది. జూన్ ముగిసిన త్రైమాసికంలో (క్యూ 1 ఎఫ్‌వై 22) నికర లాభం రూ .1,353.2 కోట్లకు పెరిగింది. గత త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 25.13% పెరిగింది. అదే విధంగా సంస్థ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 11.98% శాతంతో రూ. 10,197.6 కోట్లకు పెరిగింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో టెక్ మహీంద్రా 815 మిలియన్ డాలర్ల (6050 కోట్ల రూపాయలు) విలువ చేసే ఒప్పందాలను దక్కించుకుంది.

పివిఆర్ : PVR లిమిటెడ్ జూన్ తో ముగిసిన త్రైమాసికానికి (Q1 FY22) రూ. 219.4 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో (Q1 FY21) రూ. 225.7 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. క్యూ 1 ఎఫ్‌వై 22 లో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 367% పెరిగి 59.4 కోట్ల రూపాయలకు చేరుకుంది.

కోల్‌గేట్-పామోలివ్: కోల్‌గేట్-పామోలివ్ లిమిటెడ్ జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో (క్యూ 1 ఎఫ్‌వై 22) నికర లాభం 18 శాతం పెరిగి రూ .233.2 కోట్లకు పెరిగింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 12% YOY పెరిగి 1,157.8 కోట్లకు చేరుకుంది. EBITDA 15% (YoY) పెరిగి రూ. 350 కోట్లకు చేరింది.

టీవీఎస్ మోటార్: టీవీఎస్ మోటార్ కంపెనీ లిమిటెడ్ జూన్ (క్యూ 1 ఎఫ్‌వై 22) తో ముగిసిన త్రైమాసికంలో రూ .15 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో (క్యూ 1 ఎఫ్‌వై 21) రూ .183 కోట్ల నికర నష్టాన్ని, క్యూ 4 ఎఫ్‌వై 21 లో 310 కోట్ల రూపాయల నికర లాభాన్ని నమోదు చేసింది. Q1 FY22 లో మొత్తం ఆదాయం 141% పెరిగి రూ. 4,692 కోట్లకు చేరింది.

లారస్ ల్యాబ్స్: జూన్ ముగిసిన త్రైమాసికంలో (క్యూ 1 ఎఫ్‌వై 22) నికర లాభం రూ .241 కోట్లకు 40% వృద్ధిని లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ ప్రకటించింది. సంస్థ కార్యకలాపాల వచ్చే ఆదాయం 31.3% పెరిగి రూ .1,279 కోట్లకు పెరిగింది.

జ్యోతి ల్యాబ్స్: జ్యోతి ల్యాబ్స్ లిమిటెడ్ జూన్ తో ముగిసిన త్రైమాసికానికి (Q1 FY22) కన్సాలిడేటెడ్ నికర లాభం 20% YOY రూ. 40 కోట్లకు తగ్గింది. గత త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 48% పెరిగింది. అలాగే సంస్థ కార్యకలాపాల ద్వారా ఎఫ్‌ఎంసిజి కంపెనీ ఆదాయం 21% YOY (లేదా 6% QoQ) పెరిగి 525 కోట్లకు పెరిగింది.

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Tech Mahindra, IOC, Marico, Sun Pharma, Exide Industries

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 34,400, రెసిస్టెన్స్ లెవెల్ 34,700 గా పరిగణించాల్సి వుంటుంది. అదే విధంగా నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 15,645 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,780 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *