మార్కెట్ గ్యాప్ అప్? లాభాల జోరు కొనసాగుతుందా?

అంతర్జాతీయంగా అమెరికా ఫెడ్ రిజర్వు నుంచి అందుకున్న ప్రతికూల సంకేతాలతో గత రెండు రోజులుగా నష్టాల్లో మార్కెట్లు ట్రేడ్ అవుతున్నాయి. దీంతో ఐటీ, ఎఫ్ ఎం సి జీ షేర్లు మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురై నష్టాల్లో ముగిశాయి. అదే విధంగా నిన్నటి ట్రేడింగ్ లో  యూఎస్ మార్కెట్ సూచీలు డొజోన్స్ నష్టాల్లో ట్రేడ్ అవ్వగా నాస్ డాక్ ఫ్యూచర్స్ మాత్రం లాభాల్లో ముగిసింది. అలాగే ఆసియా, యూరోపియన్ మార్కెట్లు సైతం మిశ్రమంగా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దీంతో అంతర్జాతీయంగా అందుకున్న సానుకూల సంకేతాలతో సింగపూర్ నిఫ్టీ సుమారు 80 పాయింట్లు పైగా లాభంతో 15,756 వద్ద ట్రేడ్ కొనసాగుతుంది. ఇదే ధోరణితో మన మార్కెట్లు కూడా ఈ రోజు లాభాల్లో కొనసాగే అవకాశాలున్నాయి.

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

Ashoka BuildconBirla CableCIL Securities
GMR InfraEveready IndGujarat Fluoro
Hinduja GlobalJubilant IndPSP Projects

 

న్యూస్ స్టాక్స్:

పవర్ గ్రిడ్ కార్ప్: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 6.42% శాతంతో నికర లాభం 3,526.23 కోట్లకు పెరిగింది. దీంతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 8.83 శాతం పెరిగి రూ .12,036.46 కోట్లకు చేరుకుంది. కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు రూ .3 తుది డివిడెండ్‌ను సిఫారసు చేసింది. అలాగే బోర్డు 3: 1 నిష్పత్తిలో బోనస్ ఇష్యూను ప్రకటించింది.

నాట్కో ఫార్మా: నాట్కో ఫార్మా లిమిటెడ్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ.53 కోట్లతో 43.68%శాతం తగ్గించింది. గడిచిన త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 15.57% తగ్గింది. 2020-21 (ఎఫ్‌వై 21) ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 4.32 శాతం తగ్గి రూ .440.9 కోట్లకు చేరుకుంది.

ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ : మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 141 శాతం పెరిగి 143 కోట్ల రూపాయలకు చేరుకుంది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 34% పెరిగింది. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 6.54 శాతం తగ్గి 286.32 కోట్లకు చేరుకుంది.  అదే విధంగా కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు 1.5 రూపాయల తుది డివిడెండ్‌ను సిఫారసు చేసింది.

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

PowerGrid, Tube Investments, Infosys, Lupin, Nazara Technologies, Natco Pharma(SELL)

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 34,360, రెసిస్టెన్స్ లెవెల్ 35,010 గా పరిగణించాల్సి వుంటుంది. అదే విధంగా నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 15,650 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,780వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *