మార్కెట్ గాప్ అప్? బ్యాంకింగ్ షేర్ల హావా కొనసాగుతుందా?

గ్లోబల్ సెంటిమెంట్ సానుకూలంగా లేకపోవడంతోపాటు అమ్మకాల ఒత్తిడితో నిన్నటి ట్రేడింగ్ సెషన్ లో నిఫ్టీ 124 పాయింట్లు కోల్పోయి 14,906 వద్ద ట్రేడ్ ముగిసింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 350 పాయింట్ల కోల్పోయింది. ఇదిలావుంటే ఈ రోజు దిగ్గజ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో బ్యాంకింగ్ షేర్లలో ర్యాలీ ఉండే అవకాశాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు సైతం సానుకూల సంకేతాలు ఇవ్వడంతో ఈ రోజు మార్కెట్ లో అప్ ట్రెండ్ లో కొనసాగే అవకాశాలున్నాయి.

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

Anmol IndiaBirlasoftCCL Products
CG ConsumerContainer CorpDhanuka Agritec
Dr Lal PathLabHindalcoSBI
JSW SteelShree CementsTCI Industries

 

న్యూస్ స్టాక్స్:

బాష్: దిగ్గజ కార్పొరేట్ సంస్థ రాబర్ట్ బాష్ ఫలితాలు అదరగొట్టాయి. దీంతో నిన్నటి ట్రేడింగ్ సెషన్ లో ఒక్కరోజే రూ.1200పైగా లాభపడి 15,845 వద్ద ముగిసింది. మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో బాష్ లిమిటెడ్ నికర లాభం 495% పెరిగి రూ .482 కోట్లకు పెరిగింది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 161% శాతం పెరిగింది. ఈ సందర్భంగా కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు 115 రూపాయల డివిడెండ్‌ను సిఫారసు చేసింది.

హెచ్‌పిసిఎల్: హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్) మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో 28% క్వార్టర్-ఆన్-క్వార్టర్ (400% YOY) నికర లాభం 3017.96 కోట్లకు పెరిగింది. హెచ్‌పిసిఎల్ బోర్డు ఒక్కో షేరుకు రూ.22.75 తుది డివిడెండ్‌ను సిఫారసు చేసింది.

హావెల్స్‌ ఇండియా: మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం రూ .303.83 కోట్లకు 70.95% శాతం పెరుగుదలను హావెల్స్‌ ఇండియా కనబరిచింది. ఈ సందర్భంగా హావెల్స్‌ ఇండియా బోర్డు ఒక్కో షేరుకు మొత్తం రూ .6.50 డివిడెండ్‌ ప్రకటించింది.

రిలాక్సో: మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో రిలాక్సో ఫుట్‌వేర్ లిమిటెడ్ నికర లాభం 97.23% పెరిగి రూ .102.17 కోట్లకు చేరుకుంది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 13.4% పెరిగింది. కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు 2.5 రూపాయల తుది డివిడెండ్‌ను సిఫారసు చేసింది.

జీ ఎంటర్టైన్మెంట్: జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (జీఎల్) మార్చితో ముగిసిన త్రైమాసికంలో (క్యూ 4 ఎఫ్వై 21) రూ.275.8 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ప్రకటనల ఆదాయం 8.09% పెరిగి 1,122.96 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ సందర్భంగా జీల్ బోర్డు ఒక్కో షేరుకు రూ .2.5 డివిడెండ్‌ను సిఫారసు చేసింది.

టోరెంట్ పవర్: టోరెంట్ పవర్ మార్చితో ముగిసిన త్రైమాసికంలో (క్యూ 4 ఎఫ్‌వై 21) రూ .398.10 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 10% పెరిగి 1,295.87 కోట్లకు చేరుకుంది. టోరెంట్ పవర్ బోర్డు ఒక్కో షేరుకు తుది డివిడెండ్ 5.5 రూపాయలు మరియు మధ్యంతర డివిడెంట్ ని రూ .5.5 గా ప్రకటించింది.

మైండ్‌ట్రీ: మైండ్‌ట్రీ లిమిటెడ్ లార్సెన్ అండ్ టౌబ్రో (ఎల్ అండ్ టి) గ్రూప్ నుంచి రూ .198 కోట్లకు ఎన్‌ఎక్స్ టి డిజిటల్ బిజినెస్‌ను కొనుగోలు చేసే ఒప్పందం కుదుర్చుకుంది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Havells India, Torrent Power, Mindtree, SBI, HPCL, Axis Bank, Hindalco.

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 33,270, రెసిస్టెన్స్ లెవెల్ 33,540 గా పరిగణించాల్సి వుంటుంది. అదే విధంగా నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14880 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,051 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

అంతర్జాతీయంగా సూచీలు గ్రీన్ లో ముగిశాయి  అదే విధంగా సింగపూర్ నిఫ్టీ కూడా సానుకూలంగా ట్రేడ్ అవుతుంది కాబట్టి మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *