మార్కెట్ గాప్ అప్? బలమైన సంకేతాలతో గ్లోబల్ సూచీలు

దేశీయంగా చోటుచేసుకున్న ప్రతికూలతలతోపాటు రిజర్వు బ్యాంక్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో నిన్నటి ట్రేడింగ్ లో  సూచీలు ఆరంభం నుంచి అమ్మకాల ఒత్తిడితో ఒడుదుడుకుల మధ్య కదలాడుతూ… అంతర్జాతీయంగా అందుకున్న బలమైన సంకేతాలతో తిరిగి ముగింపులో కొనుగోళ్ళ మద్దతు లభించింది. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు 921 కోట్ల రూపాయల షేర్లను కోనుగోళ్ళు చేయగా సంస్థాగత ఇన్వెస్టర్లు 242 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. ఇదిలావుంటే అంతర్జాతీయంగా యూరప్ 0.20%, డౌ జోన్స్ 0.29%, నాస్డాక్ 0.28% శాతం పెరుగుదలతో  రికార్డు హైలో సూచీలు ట్రేడ్ అవుతున్నాయి. ఆయా దేశాల్లో కరోనా వ్యాప్తిని అరికట్టడం, వాక్సినేషన్ ప్రకియ వేగవంతం కావడం, తయారీ రంగం గణాంకాలు మెరుగ్గా వుండటం, వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు వుండే అవకాశాలు లేవని అమెరికా ఫెడ్ రిజర్వు నుంచి సంకేతాలు అందడంతో గ్లోబల్ మార్కెట్లు సానుకూలంగా దూసుకుపోతున్నాయ్. అలాగే దేశీయంగా మార్కెట్ లీడర్ రిలయన్స్ షేరు గత నాలుగు రోజులుగా రూ. 200పైగా లాభాపడి గరిష్ఠ స్థాయిలో ట్రేడ్ అవుతుంది. రిలయన్స్ రుణ రహిత సంస్థగా ఆవిర్భవించడంతో తమ బ్యాలెన్స్ పటిష్ఠంగా, మెరుగ్గా ఉన్నాయని ముకేశ్ అంబానీ స్పష్టం చేయడం మార్కెట్ కి సానుకూల పరిణామంగా చెప్పుకోవచ్చు. ఈ సానుకూలతల నేపథ్యంలో ఈ రోజు కూడా మన మార్కెట్లు ఆల్ టైం హై లో కొత్త రికార్డులు దిశగా లాభాల్లో కొనసాగే అవకాశాలున్నాయి.

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

AFLAPL ApolloCupid
Dynamic IndGuj State PetroKovai Medical
NilkamalNucleus SoftwareHKG

 

న్యూస్ స్టాక్స్:

పివిఆర్: గత మార్చి తో ముగిసిన త్రైమాసికంలో (క్యూ 4 ఎఫ్‌వై 21) పివిఆర్ లిమిటెడ్ రూ .289.12 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో (క్యూ 4 ఎఫ్‌వై 20) రూ .74.49 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది.

మదర్సన్ సుమి: నికర లాభం 289% పెరిగి 714 కోట్ల రూపాయలకు చేరుకుంది. మదర్సన్ సుమి సిస్టమ్స్ లిమిటెడ్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభంలో రూ .713.6 కోట్లకు 289% వృద్ధిని సాధించింది. అయితే గడిచిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 11% తగ్గి 1,039.13 కోట్లుగా నమోదు చేసింది. కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు 1.5 రూపాయల తుది డివిడెండ్‌ను ప్రకటించింది.

ముథూట్ ఫైనాన్స్: మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో స్వతంత్ర నికర లాభం 22.14% పెరిగి రూ .995.66 కోట్లకు పెరిగింది. మార్చి 31, 2021 నాటికి కంపెనీ రుణ ఆస్తులు 26% పెరిగి 52,622.3 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 23.32 శాతం పెరిగి రూ .3,722.18 కోట్లకు చేరుకుంది. ఈ సందర్భంగా ముథూట్ ఫైనాన్స్ బోర్డు ఒక్కో షేరుకు రూ.20 డివిడెండ్ ప్రకటించింది.

MTAR టెక్నాలజీస్: MTAR టెక్నాలజీస్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 103.04% పెరుగుదలను 18.01 కోట్లకు పెంచింది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 103.39% పెరిగింది. మార్చి 31, 2021 (ఎఫ్‌వై 21) తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 47.09 శాతం పెరిగి రూ .46.07 కోట్లకు చేరుకుంది. ఈ సందర్భంగా కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు 3 రూపాయల డివిడెండ్‌ను సిఫార్సు చేసింది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

PVR (SELL), Tata Power, MTAR Technologies, WIPRO, Adani Green, Muthoot Finance.

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 35,150, రెసిస్టెన్స్ లెవెల్ 35,630 గా పరిగణించాల్సి వుంటుంది. అదే విధంగా నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 15,515 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,647 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

దేశీయంగా ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా అమెరికా మార్కెట్లు రికార్డ్ హై లో ముగిశాయి. అలాగే రిజర్వ బ్యాంకు పాలసీ సమావేశం వుంది కాబట్టి మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *