బ్లాక్ మండే? పతనంలో ప్రపంచ మార్కెట్లు

దేశీయంగా కొవిడ్ సానుకూల పరిణామాలతో దూసుకుపోతున్న మన మార్కెట్లకు అంతర్జాతీయంగా ఎదురువుతున్న ప్రతికూల సంకేతాలతో బ్రేక్ లు పడుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో ఆర్థిక వ్యవస్థను రికవరీ చేసే విధంగా ఫెడ్ తీసుకున్న నిర్ణయాలు వెలువడినప్పటి నుంచి ప్రపంచ మార్కెట్లు అప్రమత్తత వహిస్తూ గరిష్ఠ స్థాయిల వద్ద అమ్మకాల ఒత్తిడి తలెత్తి సూచీలు తీవ్ర నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అలాగే అమెరికా మార్కెట్లలో అమ్మకాల మోత మోగడంతో డొజోన్స్ తీవ్ర స్థాయిలో గరిష్ఠ స్థాయిల వద్ద 533 పాయింట్లు కోల్పోయింది. ఇదే విధంగా ఆసియా, యూరప్ మార్కెట్లు సైతం నష్టాల బాటపట్టాయి. ఇక దేశీయంగా ఈ వారంలో మంత్లీ, విక్లీ డెరేవేటివ్ కాంట్రాక్టుల ముగింపుతో పాటు రానున్న కాలంలో ద్రవ్యోల్బణం పరంగా సవాళ్ళు ఎదుర్కోవలసి వుంటుందని రిజర్వుబ్యాంకు చేసిన వ్యాఖ్యలు మార్కెట్  పై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. అలాగే ఈ వారంలో రిలయన్స్ ఎజీఎం సమావేం కీలకం కానుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ రోజు సూచీలు తీవ్ర ఒడుదుడుకుల మధ్య నష్టాల్లో ముగిసే అవకాశాలున్నాయి.

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

Ashirwad SteelBharat DynamicsComfort
Gini Silk MillsHind Nat GlassInfo Edge
MetroglobalPokarnaVST Tillers

 

న్యూస్ స్టాక్స్:

హిందూజా గ్లోబల్: మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 203 శాతం పెరిగి రూ.131.26 కోట్లకు చేరుకుంది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 74.14% పెరిగింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 66.41 శాతం పెరిగి రూ .336.05 కోట్లకు చేరుకుంది. ఈ సందర్భంగా కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు రూ.22 తుది డివిడెండ్‌ను ప్రకటించింది.

అశోక బిల్డ్కాన్: మహారాష్ట్రకు చెందిన మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ అశోక బిల్డ్‌కాన్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ .142.46 కోట్లకు 5.87 శాతం పెరిగిందని అశోక బిల్డ్కాన్ లిమిటెడ్ తెలిపింది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 61% పెరిగింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 67.08% పెరిగి 276.22 కోట్లకు చేరుకుంది.

ఎన్‌టిపిసి: మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో ఎన్‌టిపిసి లిమిటెడ్ నికర లాభంలో 258 శాతం పెరిగి 4,479 కోట్ల రూపాయలకు ఆదాయాన్ని ఆర్జించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 36% పెరిగి 13,769 కోట్ల రూపాయలకు చేరుకుంది. కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు రూ.3.15 తుది డివిడెండ్ ప్రకటించింది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Eveready Industries (Sell), GM Infra (Sell) Hinduja Global, Zydus Cadila, HDFC Bank, NTPC, Infosys

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 34,230, రెసిస్టెన్స్ లెవెల్ 35,847 గా పరిగణించాల్సి వుంటుంది. అదే విధంగా నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 15,541 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,770వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

 

అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర నష్టాల్లో ముగిశాయి కాబట్టి మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *