బ్లాక్ మండే? కీలకం కానున్న హెచ్‌డిఎఫ్‌సి, రిలయన్స్

గతవారం కార్పొరేట్ కంపెనీల ఫలితాలతోపాటు అంతర్జాతీయ సంకేతాలపై ఆధారపడి సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు స్థాయిలో సూచీలు ముగిశాయి. ఈ వారం కూడా మార్కెట్ ఇవే కీలకం కానున్నాయి. ఇదిలావుంటే మూడో దశ కరోనా ఘంటికలు ప్రపంచ వ్యాప్తంగా మొదలవుతుడటంతో మళ్ళీ వివిధ దేశాలు లాక్ డౌన్ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. అలాగే భారత్ లో కూడా 40 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కావడం మళ్ళీ ఉదృతిని తలపించేలా పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో పాటు నిఫ్టీ గరిష్ఠ స్థాయిల్లో విదేశీ ఇన్వెస్టర్లు భారీగా షేర్లు అమ్మేస్తుండటం మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీసేలా వుంది. ఇక ప్రపంచ మార్కెట్ల సూచీలు సైతం నష్టాల్లో ముగిశాయి. ఈ ప్రతికూలతల నేపథ్యంలో ఆసియా మార్కెట్లతోపాటు సింగపూర్ నిఫ్టీ సుమారు 220 పాయింట్లు పైగా నష్టపోయి ట్రేడ్ కొనసాగుతుంది. దేశీయంగా మార్కెట్ లీడర్స్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, రిలయన్స్ పై సానుకూల అంశాలు ఉన్నప్పటికీ నిఫ్టీ కీలక మైలురాయి అయిన 16,000 మార్కును దాటుతుందో లేదో వేచిచూడాల్సిందే!

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

ACCAlok IndustriesHCL Tech
HDFC LifeMastekNippon
Supreme PetroSwaraj EnginesIndian Bank

 

న్యూస్ స్టాక్స్:

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ జూన్ తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ.7,729.60 కోట్లతో 16.1 శాతం (సంవత్సరానికి) పెరిగింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) ఇదే కాలంలో 8% పెరిగి రూ .17,009 కోట్లకు చేరుకుంది (NII అంటే బ్యాంకు తన రుణ కార్యకలాపాలపై సంపాదించే వడ్డీ ఆదాయానికి మరియు డిపాజిటర్లకు చెల్లించే వడ్డీకి మధ్య ఉన్న వ్యత్యాసం). స్థూల నిరర్ధక ఆస్తుల (జిఎన్‌పిఎ) నిష్పత్తి క్యూ 1 ఎఫ్‌వై 22 లో 1.47 శాతం కాగా, క్యూ 4 ఎఫ్‌వై 21 లో 1.32 శాతంగా ఉంది. ఈ సందర్భంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ బోర్డు ఒక్కో షేరుకు రూ .6.50 డివిడెండ్‌ను ఆమోదించింది.

జస్ట్ డయల్‌: రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ జస్ట్ డయల్‌లో 40.95% వాటాను 3,497 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. రిలయన్స్ రిటైల్ జస్ట్ డయల్‌లో మరో 26% వాటాను పొందటానికి ఓపెన్ ఆఫర్ చేస్తుంది (దాని మొత్తం వాటాను 66.95% కి పెంచనుంది).

హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్: జూన్ ముగిసిన త్రైమాసికంలో (క్యూ 1 ఎఫ్‌వై 22) నికర లాభం రూ .260.6 కోట్లకు పెరిగింది. ఇదే కాలంలో మొత్తం ఆదాయం 67.3% పెరిగి 457.8 కోట్ల రూపాయలకు చేరుకుంది. హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ భారతదేశంలోని ప్రముఖ రిటైల్ బ్రోకింగ్ సంస్థలలో ఒకటి. దేశవ్యాప్తంగా 147 నగరాలు / పట్టణాల్లో 215 శాఖలు ఉన్నాయి. హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్‌లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 96.3% వాటాను కలిగి ఉంది.

కిర్లోస్కర్ : కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ లిమిటెడ్ (కోఎల్) తన నాన్-బ్యాంక్ ఫైనాన్స్ సంస్థ (ఎన్‌బిఎఫ్‌సి) ఆర్కా ఫిన్‌క్యాప్‌లో అదనంగా 250 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

SAIL, HDFC Bank, Just Dial, HDFC, HCL Tech, Hindustan Zinc, KIRLOSENG

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 35,700, రెసిస్టెన్స్ లెవెల్ 36,000 గా పరిగణించాల్సి వుంటుంది. అదే విధంగా నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 15,870 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,965 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

అంతర్జాతీయ ప్రతికూలతల నేపథ్యంలో మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *