ప్రాఫిట్ బుకింగ్? బలహీనంగా గ్లోబల్ మార్కెట్లు

అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో నిన్నటి ట్రేడింగ్ సెషన్ నష్టాల్లో ముగిసింది. మదుపరుల అప్రమత్తతో సూచీల రికార్డు స్థాయిల్లో లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీనికితోడు కొత్త కరోనా వేరియేంట్లు మార్కెట్ ని సందిగ్ధంలో పడేశాయి. ఇక అంతర్జాతీయంగా అమెరికా మార్కెట్లో టెక్ స్టాక్స్ ర్యాలీతో నాస్ డాక్ గ్రీన్లో ముగిసింది. దేశీయంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ మార్కెట్ ని మెప్పించలేకపోయింది. అదే విధంగా ఈ రోజు ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఆరంభమవడంతో సింగపూర్ నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ కొనసాగుతుంది. వీటి ప్రభావంతో ఈ రోజు కూడా మన మార్కెట్లో లాభాల స్వీకరణ జరిగి సూచీలు ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశాలున్నాయి.

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

Bajaj SteelRossell IndiaBambino Agro
Beekay SteelCoastal CorpFinolex Cables
Indo-NationalIRCTCTriveni Engg

 

న్యూస్ స్టాక్స్:

హెచ్‌ఏఎల్: మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 31.27% పెరిగి  నికర లాభం రూ .1,622.19 కోట్లకు పెరిగింది. క్రిందటి త్రైమాసిక ఫలితాలతో పోలిస్తే నికర లాభం 90% పెరిగింది. మార్చి 31, 2021 (ఎఫ్‌వై 21) తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 12.37% పెరిగి రూ .3,239.46 కోట్లకు చేరుకుంది. ఈ సందర్భంగా HAL బోర్డు ఒక్కో షేరుకు 30 రూపాయల తుది డివిడెండ్‌ను సిఫార్సు చేసింది.

టాటా మోటార్స్: టాటా మోటార్స్ లిమిటెడ్ తన దేశీయ పోర్ట్‌ఫోలియోలో 2025 నాటికి 10 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

నాల్కో: మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 830 శాతం పెరిగి రూ.935 కోట్లకు చేరుకుంది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 290.36% పెరిగింది. మార్చి 31, 2021 (ఎఫ్‌వై 21) తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 853.8% పెరిగి సంస్థ ఆదాయం 1,299.41 కోట్ల రూపాయలకు చేరుకుంది.

ఎన్‌ఎల్‌సి ఇండియా: ప్రభుత్వరంగ సంస్థ ఎన్‌ఎల్‌సి ఇండియా మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం రూ.756.83 కోట్లకు 51.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2020-21 (ఎఫ్‌వై 21) ఆర్థిక సంవత్సరంలో సంస్థ నికర లాభం 7.4 శాతం తగ్గి రూ.1,345.44 కోట్లకు చేరుకుంది. ఎన్‌ఎల్‌సి ఇండియా బోర్డు ఒక్కో షేరుకు 1.5 రూపాయల తుది డివిడెండ్‌ను ప్రకటించింది.

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Godrej Consumers, Nalco, Tata Motors, KIOCL, HAL, Tech Mahindra

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 35,125, రెసిస్టెన్స్ లెవెల్ 35,600 గా పరిగణించాల్సి వుంటుంది. అదే విధంగా నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 15,770 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,890 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *