ప్రతికూలతలు మధ్యలో మార్కెట్? బుల్ రన్ కొనసాగుతుందా?

దేశీయంగా ప్రతికూలతల నేపథ్యంలో నిన్నటి మార్కెట్లు లాభాల నుంచి నష్టాల్లో ఫ్లాట్ గా ముగిశాయి. మే నెలలో తయారీ రంగం సూచీలు దిగజారడం, దిగ్గజ ఆటో మొబైల్ సంస్థల వాహానాల విక్రయాలు సుమారు 40శాతం పడిపోవడం, అలాగే ఈ రోజుతో మూడు రోజులపాటు రిజర్వుబ్యాంక్ పాలసీ సమావేశం ఉండటంతో మదుపరులు అప్రమత్తతో వ్యవహరించి మిడ్ సెషన్లో గరిష్ఠ స్థాయిల వద్ద షేర్లు అమ్మేశారు. ఇదిలా వుంటే వివిధ రేటింగ్ సంస్థలు భారత్ వృద్ధి రేటుపై అంచనాలు పెంచారు. తిరిగి పుంజుకునే అవకాశాలు ఎక్కువగా వుండటంతో అంకెల గణాంకాలు 9.3 శాతంగా పెంచారు. అంతర్జాతీయంగా ఆసియా మరియు ఐరోపా నుండి సానుకూల సంకేతాలు అందడంతోపాటు అమెరికాలో తయారీ రంగం, రియల్ ఏస్టేట్ రంగాల గణాంకాలు సానుకూలంగా వుండటంతో యూఎస్ మార్కెట్లు రికార్డు హైలో ట్రేడ్ అయ్యాయి. దేశీయంగా ప్రతికూలతలు ఉండటంతోపాటు ఈ రిజర్వు బ్యాంక్ పాలసీ సమావేశం వుండటంతో మార్కెట్లు వీటిని గమనిస్తూ నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. గతంలో జరిగిన రిజర్వుబ్యాంక్ సమావేశాలు మనం గమనించినట్లయితే ఆర్బీఐ మార్కెట్ ను ముందుకు తీసుకువెళ్ళే విధంగా ఆర్థిక చర్యలు, విధివిధానాలు ప్రకటించింది. చూద్దాం! ఈ రోజు నిఫ్టీ  మరిముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ రికార్డు స్థాయిలో ట్రేడ్ అవుతుందో, లేదో?

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

Jenburkt PharmaMotherson SumiMuthoot Finance
Panacea BiotecPVRRatnamani Metal

 

న్యూస్ స్టాక్స్:

ఐటిసి: మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో ఐటిసి లిమిటెడ్ నికర లాభం 3 శాతం తగ్గి రూ.3,755 కోట్లకు పడిపోయింది. ఐటిసి సిగరెట్ వ్యాపారం క్యూ 4 లో 11.5% శాతంతో రూ. 6,508 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఈ సందర్భంగా కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు రూ .5.75 తుది డివిడెండ్‌ను సిఫారసు చేసింది.

సలాసర్ టెక్నో: నికర లాభం 163 శాతం పెరిగి రూ .9.85 కోట్లకు చేరుకుంది. మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం రూ .9.85 కోట్లకు 163.36 శాతం వృద్ధిని సాధించింది. మార్చి 31, 2021 (ఎఫ్‌వై 21) తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 33.61 శాతం పెరిగి 28.89 కోట్ల రూపాయలకు చేరుకుంది. 1: 1 నిష్పత్తిలో బోనస్ వాటాలను జారీ చేసే ప్రతిపాదనకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. అలాగే ఒక్కో షేరుకు రూ.1 తుది డివిడెండ్ ప్రకటించింది.

బల్రాంపూర్ చిని: ప్రముఖ షూగర్ కంపెనీ బల్రాంపూర్ చిని మిల్స్ లిమిటెడ్ నికర లాభం రూ .235.5 కోట్లకు 2.46% తగ్గింది. మార్చి 31, 2021 (ఎఫ్‌వై 21) తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 3 శాతం తగ్గి 199.51 కోట్లకు చేరుకుంది.

గ్లెన్మార్క్ ఫార్మా: యుఎస్ లో యాంటీ-ఎపిలెప్టిక్ ఔషధాన్ని విడుదల చేస్తున్నట్లు గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ తెలిపింది.

రాడికో ఖైతాన్: రాడికో ఖైతాన్ లిమిటెడ్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 91.3% శాతంతో రూ. 73.55 కోట్లు ఆర్జించింది. మార్చి 31, 2021 (ఎఫ్‌వై 21) తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 18.9 శాతం పెరిగిరూ. 270.56 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ సందర్భంగా కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు రూ .2.4 డివిడెండ్‌ను ఇవ్వనుంది.

గుజరాత్ గ్యాస్: మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో గుజరాత్ గ్యాస్ లిమిటెడ్ నికర లాభం 40.1% పెరిగి రూ .350.86 కోట్లకు పెరిగింది. మార్చి 31, 2021 (ఎఫ్‌వై 21) తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 6.5 శాతం పెరిగి రూ .1,277.72 కోట్లకు చేరుకుంది. ఈ సందర్భంగా కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు 2 రూపాయల డివిడెండ్ ప్రకటించింది.

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Muthoot Finance, Motherson Sumi, Gujarat Gas, Radico Khaitan, Salasar Techno, Solar Industries, NMDC.

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 35,250, రెసిస్టెన్స్ లెవెల్ 35,760 గా పరిగణించాల్సి వుంటుంది. అదే విధంగా నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 15,520 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,670 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

దేశీయంగా ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా అమెరికా మార్కెట్లు రికార్డ్ హై లో ముగిశాయి. అలాగే రిజర్వ బ్యాంకు పాలసీ సమావేశం వుంది కాబట్టి మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *