పరుగులు తీస్తున్న నిఫ్టీ…SGX NIFTY@15,645

గత ఏడు రోజులుగా నిఫ్టీ రికార్డుల మోతతో స్టాక్ మార్కెట్లో మదుపరుల సంపద 223 లక్షల కోట్లకు చేరుకుంది. అదే విధంగా ఆల్ టైం హైలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,412 కోట్ల విలువైన షేర్లు కొనుగోళ్ళు చేయగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 180 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను నిన్నటి ట్రేడింగ్ సెషన్ లో కొనుగోలు చేయటంతో రికార్డు స్థాయిలో ట్రేడ్ ముగిసింది.  ఇలా గరిష్ఠ స్థాయిల్లో పెట్టుబడి పెడుతున్నారంటే ఇంకా మార్కెట్ ని ముందుకు తీసుకెళ్ళే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇక దేశీయంగా ఇండియా జీడీపీ నాలుగో త్రైమాసికంలో గణాంకాలు మెరుగ్గా వుంటాయని గణాంకాలు మరియు ప్రోగ్రామ్ అమలు మంత్రిత్వ శాఖ వెల్లడించడంతో దీని ప్రభావం మార్కెట్ పై వుండే అవకాశాలున్నాయి. అంతర్జాతీయంగా సూచీలు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. అమెరికాలో మెమోరియల్ డే వుండటంతో నిన్నటి మార్కెట్లు పనిచేయలేదు. అలాగే అమెరికాలో మే నెలకు సంబంధించి జాబ్స్ డేటా వెలువడనుండటంతో డోజోన్స్, నాస్ డాక్ ఫ్యూచర్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ రోజు కూడా మన మార్కెట్లు సానుకూలంగా లాభాల్లో ట్రేడ్ అయ్యే అవకాశాలున్నాయి.

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

Balrampur ChiniGujarat GasITC
Swelect EnergyEmami PaperNGL Fine Chem

 

న్యూస్ స్టాక్స్:

అరబిందో ఫార్మా: అరబిందో ఫార్మా లిమిటెడ్ మార్చిలో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 7% తగ్గి 801 కోట్లకు ఆదాయాన్ని ఆర్జించింది.

పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్: పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ డైరెక్టర్ల బోర్డు పెట్టుబడిదారులకు షేర్లు, వారెంట్లు జారీ చేయడం ద్వారా రూ .4 వేల కోట్ల వరకు నిధుల సేకరణకు ఆమోదం తెలిపింది.

మ్యాన్ ఇండస్ట్రీస్: మ్యాన్ ఇండస్ట్రీస్ (ఇండియా) లిమిటెడ్ ఏకీకృత నికర లాభం 106.88% పెరుగుదలను 25.86 కోట్లకు పెరిగింది. కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు రూ .2 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది.

శిల్పా మెడికేర్: మార్చి (Q4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 77.35% తగ్గి 7.83 కోట్లకు చేరుకుంది. మార్చి 31, 2021 (ఎఫ్‌వై 21) తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 5.36 శాతం తగ్గి 147.78 కోట్లకు చేరుకుంది. ఫార్మా కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు రూ .1.10 డివిడెండ్ ప్రకటించింది.

జె కుమార్ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్: జె కుమార్ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్ లిమిటెడ్ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంఎంఆర్‌డిఎ) నుంచి 1,307.88 కోట్ల రూపాయల ఆర్డర్‌ను పొందింది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

ITC, Narayana Hrudayalaya, Aurobindo Pharma (Sell), PEL, PNB Housing

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 35,190 రెసిస్టెన్స్ లెవెల్ 35,650 గా పరిగణించాల్సి వుంటుంది. అదే విధంగా నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 15,471 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,625 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

దేశీయంగా మరియు అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలున్నాయి కాబట్టి మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *