నిఫ్టీ 16,000? టీసీఎస్ ఫలితాలు ఆదరగొడుతుందా?

దేశీయ మార్కెట్ లో సెన్సెక్స్ కొత్త రికార్డులను నెలకొల్పొంది. దీంతో సెన్సెక్స్ 53,000 మైలు రాయిని దాటింది. నిన్నటి ట్రేడింగ్ లో సూచీలు ఆరంభం నుంచి కాన్సాలిడేషన్లో ఉన్నప్పటికీ మిడ్ సెషన్ నుంచి మెటల్, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ళు రావడంతో నిఫ్టీ నష్టాల నుంచి లాభాల్లోనే ముగిసింది. దేశీయంగా ఎటువంటి సానుకూల పరిణామాలు లేనప్పటికీ అంతర్జాతీయంగా అమెరికాలో ఫెడ్ రిజర్వు మినిట్స్ మీటింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రపంచ మార్కెట్ల సూచీలు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. అయితే ఈ రోజు ఆసియా మార్కెట్లు టోక్యో, సింగపూర్ మార్కెట్ల సూచీలు నష్టాల్లో ఆరంభమయ్యాయి. ఇదిలావుంటే దిగ్గజ ఐటీ కంపెనీ టీసీఎస్ క్యూ1 ఫలితాలు ఆశించిన స్థాయి కంటే మెరుగ్గా వుంటాయని పలు బ్రోకరేజీ సంస్థలు అంచనాలు వేయడంతో ఐటీ షేర్లు మార్కెట్ ను ముందుకు తీసుకెళ్ళే అవకాశాలున్నాయి.

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

TCSPadmanabh Ind
Gammon InfraShyam Metalics

 

న్యూస్ స్టాక్స్:

బజాజ్ హెల్త్‌కేర్: ప్రముఖ ఫార్మా కంపెనీ బజాజ్ హెల్త్‌కేర్ కు 2-డియోక్సీ-డి-గ్లూకోజ్ (2-డిజి) తయారీ మరియు మార్కెట్ చేయడానికి రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఓ) నుండి అనుమతి లభించింది. ఈ ఔషధాన్ని కోవిడ్ రోగుల చికిత్స నిమిత్తం ఉపయోగిస్తారు.

మహీంద్ర గ్రూప్ : మహీంద్రా మరియు మహీంద్రా (ఎం అండ్ ఎం) లిమిటెడ్ అనుబంధ సంస్థ హిసార్లార్ నుంచి టర్కీలో వ్యవసాయ యంత్రా పరికరాల వ్యాపారాన్ని పున:ప్రారంభిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

జిందాల్ స్టీల్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంభించిన క్యూ1 త్రైమాసిక ఫలితాలుల్లో భాగంగా జిందాల్ స్టీల్ & పవర్ లిమిటెడ్ (జెఎస్‌పిఎల్) తమ ఉత్పత్తిలో 20% వృద్ధిని సాధించినట్లు కంపెనీ తెలిపింది. 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Jindal Steel, Tata Steel, M&M, TCS

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 35,490, రెసిస్టెన్స్ లెవెల్ 36,000 గా పరిగణించాల్సి వుంటుంది. అదే విధంగా నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 15,780 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,950 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *