నిఫ్టీ 15,500? క్రొత్త రికార్డులు దిశగా మార్కెట్

నిన్నటి ట్రేడింగ్ లో ఐటీ, ఫైనాన్స్, ఆటో మోబైల్ రంగాల్లో కొనుగోళ్ళు చోటు చేసుకోవడంతో గరిష్ఠ స్థాయిల వద్ద నిఫ్టీ 15,301 వద్ద ట్రేడ్ ముగిసింది. విదేశీ ఇన్వెస్టర్లు హైయ్యార్ లెవెల్స్ లో రూ.247 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అధిక స్థాయిల వద్ద కొనుగోళ్ళతో నిఫ్టీ 15,500 మార్కు దిశగా బుల్ పరుగులు పెట్టే అవకాశాలు మెండుగా ఉండే అవకాశాలున్నాయి. మెటల్, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు జరగడంతో బ్యాంక్ నిఫ్టీ సూచీలు కాన్సాలిడేషన్ లో నష్టాల నుంచి స్వల్ప లాభాల్లో ముగిశాయి. దేశీయంగా కరోనా పాజటివ్ రేటు తగ్గడంతోపాటు, వాక్సినేషన్ ప్ర్రక్రియ వేగవంతం కావడం, లాక్ డౌన్ ఆంక్షలు దశల వారీగా ఎత్తివేసే సమాలోచనలు జరుగుతుండటంతో మార్కెట్ కి సానుకూల పరిణామంగా చెప్పకోవచ్చు. ఈ రోజు వారాంతాపు మరియు నెలవారీ డెరెవేటివ్ కాంట్రాక్టుల ఎక్సపయిరీ ఉన్నాప్పటికీ సూచీలు హెచ్చు, తగ్గులతో లాభాల్లో ముగిసే అవకాశాలున్నాయి.

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

Aegis LogisticsAlkyl AminesAmrutanjan Heal
Borosil Ltd.Cadila HealthDixon Technologies
Eicher MotorsGreenlam IndHonda India PP
KIOCLPage IndustriesSun Pharma

 

న్యూస్ స్టాక్స్:

బెర్గర్ పెయింట్స్: బెర్గెర్ పెయింట్స్ ఇండియా లిమిటెడ్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభంలో 101% వృద్ధితో రూ. 208.60 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. మార్చి 31, 2021 (ఎఫ్‌వై 21) తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 9.4 శాతం పెరిగి 719.75 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ సందర్భంగా కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు రూ.2.80 డివిడెండ్‌ను సిఫారసు చేసింది.

మనప్పురం ఫైనాన్స్: మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో మనపురం ఫైనాన్స్ నికర లాభంలో రూ .468.35 కోట్లకు 17.6 శాతం వృద్ధిని నమోదు చేసింది. మార్చి 31, 2021 (ఎఫ్‌వై 21) తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 16.5 శాతం పెరిగి సంస్థ ఆదాయం రూ .1,724.95 కోట్లకు చేరుకుంది. బోర్డు ఒక్కో షేరుకు రూ. 0.75 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది.

వి-గార్డ్ ఇండస్ట్రీస్: వి-గార్డ్ ఇండస్ట్రీస్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 112% పెరిగి 68.39 కోట్ల రూపాయలకు చేరుకుంది. మార్చి 31, 2021 (ఎఫ్‌వై 21) తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 7.25 శాతం పెరిగి 201.89 కోట్ల రూపాయలకు చేరుకుంది. కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు రూ .1.20 డివిడెండ్ ప్రకటించింది.

బర్గర్ కింగ్: బర్గర్ కింగ్ ఇండియా లిమిటెడ్ మార్చితో ముగిసిన త్రైమాసికంలో (క్యూ 4 ఎఫ్‌వై 21) రూ .25.9 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది.

బీపీసీఎల్: భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్) మార్చితో ముగిసిన త్రైమాసికంలో (క్యూ 4 ఎఫ్‌వై 21) రూ .11,940 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్యూ 4 ఎఫ్‌వై 21 లో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 21.5 శాతం పెరిగి రూ .98,755.6 కోట్లకు చేరుకుంది.

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

TataPower, Berger Paints, Concor, SunPharma, Cadila Health, BPCL, V-Gurad.

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 34,570, రెసిస్టెన్స్ లెవెల్ 35,060 గా పరిగణించాల్సి వుంటుంది. అదే విధంగా నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 15,254 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,355 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఈరోజు గురువారం విక్లీ, మంత్లీ డెరేటివ్ కాంట్రాక్టుల ఎక్సపయిరీ వుంది కాబట్టి మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *