నిఫ్టీ గ్యాప్ అప్ ? వ్యాక్సిన్ ఫలితాలతో ఆదరగొడుతున్న మార్కెట్లు

దేశీయంగా, అంతర్జాతీయంగా అందిన బలమైన సంకేతాలతోపాటు మార్కెట్ లీడర్స్ హెచ్ డి ఎఫ్, రిలయన్స్ షేర్లు దన్నుగా నిలవడంతో సూచీలు బలమైన మద్దతు స్థాయిలను కోల్పోకుండా ఇంట్రేడేలో నిఫ్టీ సుమారు 240 పాయింట్లు లాభపడింది. అలాగే ప్రభుత్వరంగ సంస్థ లాభాల్లో ట్రేడ్ అవ్వడంతో బ్యాంక్ నిఫ్టీ కూడా లాభాల్లో ముగిసింది. దీనికి ప్రధాన కారణాలుగా దేశంలో వాక్సినేషన్ ప్రక్రియ రికార్డుల వేగంతో పూర్తి చేస్తుండటం, లాక్ డౌన్లను రాష్ట్రాలు ఎత్తివేయనుండటంతోపాటు విద్యారంగ సంస్థలు సైతం తెరవనుండటంతో సాధారణ జీవన పరిస్థితులు దిశగా ప్రజానీకం కదులుతుండటంతో నిఫ్టీ కనిష్ఠ స్థాయిల వద్ద మదుపరులు పెట్టుబడులు పెడుతున్నారు. అలాగే మార్కెట్ దిగ్గజాలు సైతం మరో సంవత్సరంపాటు బుల్ ట్రెండే కొనసాగుతుందని జోస్యం చెబుతున్నారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్లు సైతం సూచీలు ఎగబాకి గరిష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అదే విధంగా గురువారం రిలయన్స్ ఎజీఎం మీటింగ్ జరుగునున్న నేపథ్యంలో చమురు సంస్థలతో రిలయన్స్ లక్షల కోట్లకు సంబంధించిన ఒప్పందాలు జరిగే అవకాశాలున్నట్లు ఊహగానాలు వీనబడుతుండటంతో ఈ రోజు కూడా మార్కెట్లో బుల్ రన్ కొనసాగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

Ashapura MineAvanti FeedsBharat Elec
Donear IndGE Power IndiaKshitiz Leasing
NMDCSobhaVibrant Global

 

న్యూస్ స్టాక్స్:

ఇన్ఫో ఎడ్జ్: ఇన్ఫో ఎడ్జ్ (ఇండియా) లిమిటెడ్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 157.11 శాతం పెరిగి రూ.306.22 కోట్లకు పెరిగింది. మార్చి 31, 2021 (ఎఫ్‌వై 21) తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 692.16 శాతం పెరిగి 1,407.08 కోట్లకు చేరుకుంది.

హెచ్‌బిఎల్ పవర్ : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ బ్యాటరీ మరియు పవర్ సిస్టమ్స్ సంస్థ హెచ్‌బిఎల్ పవర్ సిస్టమ్స్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 36.44 శాతం పెరిగి రూ .9.66 కోట్లకు పెరిగింది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 15.97% పెరిగింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 47.75 శాతం తగ్గి 12.31 కోట్లకు చేరుకుంది. కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు 0.35 రూపాయల డివిడెండ్‌ను ఆమోదించింది.

భారత్ డైనమిక్స్: భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బిడిఎల్) నికర లాభం 15.9% తగ్గి రూ .260.36 కోట్లకు చేరుకుంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 51.8 శాతం తగ్గి 257.76 కోట్లకు చేరుకుంది. అలాగే కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు 0.65 రూపాయల డివిడెండ్‌ను ప్రకటించింది.

జెఎస్‌డబ్ల్యు సిమెంట్: జెఎస్‌డబ్ల్యు సిమెంట్ లిమిటెడ్ ‘జెఎస్‌డబ్ల్యు కాంక్రీట్’ బ్రాండ్ పేరుతో రెడీ మిక్స్ కాంక్రీట్ (ఆర్‌ఎంసి) వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. కంపెనీ తన మొట్టమొదటి వాణిజ్య ఆర్‌ఎంసి యూనిట్‌ను ముంబైలోని చెంబూర్‌లో ఏర్పాటు చేయునున్నట్లు తెలిపింది.

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Infoedge, JSWSTEEL, Reliance, NMDC, Avanti Feeds.

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 34,420, రెసిస్టెన్స్ లెవెల్ 35,300 గా పరిగణించాల్సి వుంటుంది. అదే విధంగా నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 15,635 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,815 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *