నిఫ్టీ గ్యాప్ అప్? బ్యాంకింగ్ స్టాక్స్ లో ర్యాలీ వుంటుందా?

అంతర్జాతీయ ప్రతికూలతలతో నిన్నటి ట్రేడింగ్ లో నిఫ్టీ ఊగిసలాట మధ్య నష్టాల్లో ముగిసింది. కొవిడ్ భయాలతో ఆసియా మార్కెట్లలో అమ్మకాలు తలెత్తడంతో సూచీలు నిరాశంగా ట్రేడయ్యాయి . ఇదిలా వుంటే అమెరికాలో ఐటీ కంపెనీల ఫలితాలు మెరుగ్గా వుండటంతో యూస్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఇక దేశీయంగా బ్యాంకింగ్ సెక్టార్ లో దాదాపు అన్ని ప్రయివేట్ బ్యాంక్స్ జూన్ త్రైమాసికానికి సంబంధించి మెరుగైన ఫలితాలును వెల్లడించడంతో ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలో ర్యాలీ వుండే అవకాశాలున్నాయి. దీంతో నిఫ్టీ కూడా లాభాల్లోనే ముగిసే అవకాశాలున్నాయి.

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

Aarti DrugsCanara BankDixon Technolog
Dr Reddys LabsGM BreweriesIIFL Finance
Mahindra LogistRamcoindKPR Mill

 

న్యూస్ స్టాక్స్:

టాటా మోటార్స్ : దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ లిమిటెడ్ జూన్ లో ముగిసిన త్రైమాసికంలో (క్యూ 1 ఎఫ్‌వై 22) రూ .4,450.92 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో (క్యూ 1 ఎఫ్‌వై 21) రూ .8,437.99 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. గ్లోబల్ చిప్ కొరత, కరోనావైరస్ వేరియంట్ల వ్యాప్తి కారణంగా అనిశ్చితి నెలకొనడంతో వ్యాపార అంచనాలు తగ్గినట్లు టాటా మోటార్స్ తెలిపింది.

కోటక్ మహీంద్రా : జూన్ ముగిసిన త్రైమాసికంలో (క్యూ 1 ఎఫ్‌వై 22) నికర లాభం 32 శాతం పెరిగి రూ. అదే విధంగా ఈ త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 6% పెరిగి రూ .3,942 కోట్లకు చేరుకుంది. అలాగే బ్యాంకు నిర్వహణ లాభం 19% పెరిగి రూ .3,121 కోట్లకు చేరుకుంది.

యాక్సిస్ బ్యాంక్ : ప్రముఖ ప్రయివేట్ సెక్టార్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ముగిసిన త్రైమాసికంలో (క్యూ 1 ఎఫ్‌వై 22) నికర లాభం 94 శాతం వృద్ధితో రూ .2,160 కోట్లకు చేరుకుంది. ఇదే కాలంలో నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 11% పెరిగి 7,760 కోట్ల రూపాయలకు చేరుకుంది.

ఎల్ అండ్ టి: ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ జూన్ త్రైమాసికం క్యూ 1 లో ఇబిఐటిడిఎ 95.8 శాతం పెరిగి రూ .317175 కోట్లకు చేరుకుంది. అలాగే టి సంస్థ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 38% YOY పెరిగి 29,335 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ త్రైమాసికంలో ఎల్ అండ్ టి రూ .26,557 కోట్ల విలువైన ఆర్డర్‌లను పొందటంతో  13% వృద్ధిని నమోదు చేసింది.

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

ITC, Axis Bank, L&T, Kotak Bank, Indus Bank, Tata Motors(Sell)

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 34,850, రెసిస్టెన్స్ లెవెల్ 35,350 గా పరిగణించాల్సి వుంటుంది. అదే విధంగా నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 15,815 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,900 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *