నష్టాల్లో గ్లోబల్ సూచీలు? అమ్మకాలు కొనసాగుతాయా?

నిఫ్టీ 15 వేలు దాటిన ప్రతిసారీ మార్కెట్లు తిరుగుముఖం పడుతున్నాయి. అధిక స్థాయిల వద్ద ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో లాభాల స్వీకరణతో సూచీలకు నిరోధం ఏర్పడుతుంది. దీంతో నిన్నటి ట్రేడింగ్ లో ఫైనాన్స్, బ్యాంకింగ్, ఐటీ, మెటల్ షేర్ల అమ్మకాలతో నష్టాల్లో ట్రేడ్ అయింది. అయితే ఈ దాఫా భారీ అమ్మకాలు ఉండకపోవడచ్చు. దీనికి ప్రధాన కారణాలుగా కరోనా కేసులలో తగ్గుదలతో పాటు వాక్సినేషన్ ప్రకియ వేగవంతంగా అవ్వడం, కరోనా నివారణకు వివిధ రకాల ఔషధాలు మార్కెట్లోకి అందుబాటులోకి రావడం వంటివి సానుకూల అంశాలుగా పరిగణించవచ్చు. అంతర్జాతీయ సూచీలు బలహీనంగా మిశ్రమంగా ట్రేడ్ అవుతుండటంతో ఈ రోజు కూడా మన మార్కెట్లు ఒడుదుడుకుల మధ్య సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిసే అవకాశాలున్నాయి.

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

Acrysil IndiaBoschBrookfield REIT
EPLHavells IndiaHPCL
JK Lakshmi CemKNR ConstructNDTV
Relaxo FootwearTorrent PowerZee Entertain

 

న్యూస్ స్టాక్స్:

ఐఓసిఎల్ : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఒసిఎల్) మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో క్వార్టర్-ఆన్-క్వార్టర్ (QoQ) 78.6% శాతంతో నికర లాభం రూ.8,781 కోట్లకు పెరిగింది. ఈ సందర్భంగా ఐఓసిఎల్ బోర్డు ఒక్కో షేరుకు రూ.1.50 తుది డివిడెండ్‌ను ప్రకటించింది.

అదానీ గ్రీన్ ఎనర్జీ: అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఎజిఇఎల్) ఎస్బి ఎనర్జీ ఇండియా (సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కు చెందినది) నుండి 5 గిగావాట్ల (జిడబ్ల్యు) విద్యుత్ పునరుత్పాదక చేసేందుకు 3.5 బిలియన్ డాలర్ల (రూ.25,600 కోట్లు) కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

జెకె టైర్ : మార్చి ముగిసిన త్రైమాసికంలో (క్యూ 4 ఎఫ్‌వై 21) రూ .196.02 కోట్ల నికర లాభాన్ని జెకె టైర్ అండ్ ఇండస్ట్రీస్ తెలిపింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో  కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 63.3 శాతం పెరిగి ఆదాయం రూ.2,921.28 కోట్ల రూపాయలకు చేరుకుంది. కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు 2 రూపాయల డివిడెండ్‌ను కంపెనీ ఇవ్వనుంది.

ఎండ్యూరెన్స్ టెక్: ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 75.42% శాతం పెరిగి రూ .187.4 కోట్లకు పెరిగింది. ఈ సందర్భంగా కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు 6 రూపాయల డివిడెండ్‌ను సిఫారసు చేసింది. ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ భారతదేశంలో ఆటోమోటివ్ భాగాల తయారీలో అగ్రగామి సంస్థ.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Coforge, Anupam Rasayan, Dr.Reddy, IOC, JK Tyre, Adani Green Energy, KNR Constructions, Torrent Power, Havells India.

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 33,616, రెసిస్టెన్స్ లెవెల్ 33,885 గా పరిగణించాల్సి వుంటుంది. అదే విధంగా నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 15,010 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,105 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

అంతర్జాతీయంగా సూచీలు మిక్సిడ్ గా నష్టాల్లో ముగిశాయి కాబట్టి మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *