దూకుడుగా మార్కెట్లు…నిఫ్టీ 15,200?

నిన్నటి  ట్రేడింగ్ సెషన్లో బుల్ అనుహ్యరీతిలో పరుగులు తీసింది. ఆద్యంతం లాభాల బాటలోనే నడిచి మదుపరులను ఆశ్యర్యపరిచాయి. బ్యాంకింగ్ షేర్లలో కనిష్ఠ స్థాయిల వద్ద షార్ట్ రికవరీ జరగడంతో బ్యాంక్ నిఫ్టీలో ర్యాలీ కొనసాగింది. నిఫ్టీ 245 పాయింట్లు లాభపడగా, బ్యాంక్ నిఫ్టీ 1289 పాయింట్లు పెరిగింది. నిన్నటి ట్రేడింగ్ లో విదేశీ ఇన్వెస్టర్లు 5,797 కోట్ల రూపాయల కొనుగోలు చేయగా దేశీయ ఇన్వెస్టర్లు 7,096 కోట్లు కొనుగోలు చేశారు. దీనికి తోడు అంతర్జాతీయ సూచీలు బలమైన సంకేతాలు ఇవ్వడం, హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యుపిఐ) పెరగడం, కరోనా పాజటివ్ కేసుల్లో తగ్గుదల కనిపించడం, కంపెనీల ఫలితాలు వంటి అంశాలు జత కూడి మార్కెట్లను ముందుకు తీసుకెళ్ళాయి. ఇదే ధోరణితో మార్కెట్లు ఈ రోజు కూడా లాభాల్లోనే కొనసాగే అవకాశాలున్నాయి.

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

Aarti IndAbbott IndiaCanara Bank
JBM AutoPI IndustriesTata Motors
Torrent PharmaUjjivan SmallJyothy Labs

 

న్యూస్ స్టాక్స్:

భారతీ ఎయిర్‌టెల్: దిగ్గజ టెలికాం కంపెనీ భారతి ఎయిర్‌టెల్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో భారతీ ఎయిర్‌టెల్ గత త్రైమాసిక ఫలితాలతో పోల్చితే నికర లాభం 11% శాతం తగ్గి క్వార్టర్-ఆన్-క్వార్టర్ (QoQ) (క్యూ 4) నికర లాభం రూ.759 కోట్లు నమోదు చేసింది.

ఫెడరల్ బ్యాంక్: ఫెడరల్ బ్యాంక్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 58.6% పెరిగి 477.8 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ సందర్భంగా ఫెడరల్ బ్యాంక్ బోర్డు ఒక్కో షేరుకు 0.70 తుది డివిడెండ్‌ను సిఫారసు చేసింది.

గ్లాండ్ ఫార్మా: మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ నికర లాభం 34% పెరిగి రూ .260.4 కోట్లకు చేరుకుంది. మార్చి 31, 2021 (ఎఫ్‌వై 21) తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 29% పెరిగి రూ .996.96 కోట్లకు చేరుకుంది.

కోల్‌గేట్-పామోలివ్: కోల్‌గేట్-పామోలివ్ ఇండియా మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 54.1% శాతం పెరిగి 314.6 కోట్ల రూపాయలు ఆదాయాన్ని ఆర్జించింది. మార్చి 31, 2021 (ఎఫ్‌వై 21) తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 26.8 శాతం పెరిగి రూ.1,035.39 కోట్లకు కంపెనీ ఆదాయం చేరుకుంది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Federal Bank, Gland Pharma, Jyothy Labs, Praj Industries, SBI Life Insurance

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 32,641, రెసిస్టెన్స్ లెవెల్ 33,548 గా పరిగణించాల్సి వుంటుంది. అదే విధంగా నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14,725 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,051 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

సింగపూర్ నిఫ్టీ 165 పాయింట్ల లాభంతో 15120 వద్ద ట్రేడ్ కొనసాగడంతోపాటు గ్లోబల్ మార్కెట్లు కూడా ఫ్లాట్ గా ముగిశాయి కాబట్టి మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *