గ్లోబల్ సెంటిమెంట్ రెడ్… నష్టాలు కొనసాగుతాయా?

అంతర్జాతీయ ప్రతికూలతలతో సతమతమవుతున్న మన మార్కెట్లకు వరుసగా మూడో రోజు కూడా నష్టాలే మిగిల్చాయి. మార్కెట్ ఆరంభంలో సూచీలు గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటికీ మిడ్ సెషన్ నుంచి అమ్మకాలు ఒత్తిడి పెరగడంతో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ నష్టాల్లో ముగిశాయి. ఇదిలా వుంటే ఈ రోజు కూడా ఆసియా మార్కెట్ల సూచీలు నష్టాల్లో ఆరంభమయ్యాయి దీంతో సింగపూర్ నిఫ్టీ సూచీలు నష్టాల నుంచి స్పల్ప లాభాల్లో  కొనసాగతున్నాయి. అంతర్జాతీయంగా అమెరికాలో జాబ్ డేటా శుక్రవారం వెలువడనుండటంతో నాస్ డెక్ సూచీలు నిరాశగా ముగిశాయి. అదే విధంగా చైనా మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ ఇండెక్స్ గణాంకాలు డీలా పడటం, అలాగే కరోనా కొత్త వేరియంట్లు కలవపెడుతుండటంతో గ్లోబల్ మార్కెట్లు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. దేశీయంగా ఈ రోజు జూన్ నెలకు సంబంధించి ఆటో మొబైల్ విక్రయ గణాంకాలు వెలువడనుండటంతోపాటు ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పిఎంఐ)గణాంకాలను కేంద్రం విడుదల చేయనుంది. అదే విధంగా ఈ రోజు గురువారం విక్లీ ఎక్సపయిరీ వుండటంతో సూచీలు భారీ వాలటల్టీ మధ్య ట్రేడయ్యే అవకాశాలున్నాయి.

న్యూస్ స్టాక్స్:

టాటా మోటార్స్: దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ టాటామోటార్స్ కు ఇండియాన్ ఆయిల్ కార్పొరేషన్ కంపెనీ నుంచి 15 హైడ్రోజన్ పవర్ బస్సులకు సంబంధించిన ఆర్డర్ ను సొంతం చేసుకుంది. అదే విధంగా రీసెర్చ్ & డెవలప్‌మెంట్ (ఆర్‌అండ్‌డి) ప్రాజెక్టులను చేపట్టడానికి మరియు వాణిజ్య వాహనాల కోసం ఇంధన సెల్ సాంకేతిక పరిజ్ఞానం యొక్క సామర్థ్యాన్ని లోతుగా అధ్యయనం చేయడానికి ఐఓసిఎల్‌తో కలిసి పని చేస్తుంది.

ఎన్‌బిసిసి: ప్రభుత్వరంగ సంస్థ ఎన్‌బిసిసి మార్చి 2021 (క్యూ 4 ఎఫ్‌వై 21) తో ముగిసిన త్రైమాసికంలో రూ .83 కోట్ల నికర లాభం ఎన్‌బిసిసి ఆర్జించింది. క్యూ 4 ఎఫ్‌వై 21 లో దీని మొత్తం ఆదాయం 2.09% పెరిగి 2,706.80 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ సందర్భంగా కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు 0.47 తుది డివిడెండ్‌ను ప్రకటించింది.

ఇర్కాన్ ఇంటర్నేషనల్: మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం రూ .170.43 కోట్లకు 47.69 శాతం వృద్ధిని ఇర్కాన్ ఇంటర్నేషనల్ ప్రకటించింది. ఇదే కాలంలో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 29.27% ​​పెరిగి 2,421.65 కోట్ల రూపాయలకు చేరుకుంది. మార్చి 31, 2021 (ఎఫ్‌వై 21) తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 19.4 శాతం తగ్గి 391.06 కోట్లకు సంస్థ ఆదాయం పరిమితమైంది.

సన్ టెక్ రియాల్టీ: మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 215.94 శాతం పెరిగి రూ .10.40 కోట్లకు చేరుకుంది. మార్చి 31, 2021 (ఎఫ్‌వై 21) తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 43.35 శాతం తగ్గి రూ .41.94 కోట్లకు చేరుకుంది. కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు 1.5 రూపాయల తుది డివిడెండ్‌ను ప్రకటించింది.

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Tata Motors, Best Agrolife, LUPIN, Hatsun Agro

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 34,670, రెసిస్టెన్స్ లెవెల్ 34,860గా పరిగణించాల్సి వుంటుంది. అదే విధంగా నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 15,710 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,770 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *