గ్లోబల్ సెంటిమెంట్ రెడ్…ఐటీ స్టాక్స్ రాణిస్తాయా?

దేశీయ, అంతర్జాతీయ ప్రతికూలతలతో నిన్నటి ట్రేడింగ్ సెషన్ నష్టాల్లో ముగిసింది. దీంతో నిఫ్టీ రికార్డు స్థాయిలో మదుపరులు అమ్మకాలకు మొగ్గు చూపారు. అదే విధంగా దిగ్గజ ప్రయివేట్ బ్యాంక్ హెచ్ డిఎఫ్ సి క్యూ1 ఫలితాలు మెరుగ్గా వుండటంతో బ్యాంకింగ్ స్టాక్స్ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. జీఎస్టీ వసూళ్ళు లక్ష కోట్లకు పైగా పడిపోవడం, దేశీయ తయారీ, సేవారంగ ఆర్థిక గణాంకాలు దిగజారడంతోపాటు అంతర్జాతీయంగా యూస్ మార్కెట్స్ సూచీలు రికార్డ్ హైలో నుంచి పడిపోవడంతో మార్కెట్ సెంట్మెంట్ ని దెబ్బతీసింది. అలాగే గ్లోబల్ మార్కెట్ల సూచీలు సైతం గత రెండు రోజులుగా మిశ్రమంగానే ట్రేడ్ అవుతూ నిన్నటి ట్రేడింగ్ లో నష్టాల్లో ముగిశాయి. ఇదిలావుంటే రేపు (గురువారం) దిగ్గజ ఐటీ కంపెనీ టీసీఎస్ క్యూ1 ఫలితాలు వెల్లడించనున్న నేపథ్యంలో ఐటీ స్టాక్స్ మెరుగ్గా ట్రేడ్ అయ్యే అవకాశాలున్నాయి.

న్యూస్ స్టాక్స్:

టైటాన్: ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థ టైటాన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1 త్రైమాసిక ఫలితాలు 107 % శాతంతో రికార్డ్ హైలో సంస్థ అన్ని విభాగాలు కలుపుకొని నికర లాభం శాతాల్లో ప్రకటించింది.

అశోక్ లేలాండ్: ప్రముఖ వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ రాబోయే నెలల్లో సంస్థ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచబోతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. COVID-19 ప్రభావం వల్ల గత ఏప్రిల్ మరియు మే నెలలలో ప్లాంట్లను మూసివేసినట్లు కంపెనీ తెలిపింది.

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

TVS Motors, Titan, TCS, RBL Bank, Mastek

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 35,430, రెసిస్టెన్స్ లెవెల్ 35,830గా పరిగణించాల్సి వుంటుంది. అదే విధంగా నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 15,780 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,865 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *