గ్లోబల్ సెంటిమెంట్ గ్రీన్…లాభాల్లో సూచీలు?

గతవారం దేశీయంగా ఎటువంటి సంకేతాలు లేకపోవడంతో అంతర్జాతీయ సంకేతాల మీద ఆధారపడ్డ మార్కెట్లు ఈ వారం కూడా ఇదే ధోరణితో ముందుకు కొనసాగే అవకాశాలున్నాయి. అమెరికాలో జాబ్ డేటా పాజటివ్ గా నమోదు కావడంతో డోజోన్స్, నాస్ డాక్ సూచీలు సానుకూలంగా లాభాల్లో ముగిశాయి.అమెరికాలో ఇండిపెండెన్స్ డే కావడంతో రేపు (జూలై 5 వారి కాలామన ప్రకారం) యూస్ మార్కెట్లు పనిచేయవు. ఇక దేశీయంగా సానుకూల అంశాలుగా వివిధ రాష్ట్రాలు లాక్ డౌన్లు ఎత్తివేసే దిశగా నిర్ణయాలు తీసుకుండటం, ఈ రోజు సేవల రంగానికి సంబంధంచిన గణాంకాలు వెలువడుతుండటం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ కంపెనీల ఏప్రిల్ – జూన్ క్యూ1 త్రైమాసిక ఫలితాలు విడుదలకానున్నాయి. గురువారం టీసీఎస్ ఫలితాలు వెలువడనుండటంతో ఐటీ షేర్లు మార్కెట్ ను ముందుకు నడిపించవచ్చు. అదే విధంగా మరికొన్ని ఐటీ కంపెనీలతో పాటు ఫార్మా సెక్టార్కు  సానుకూల వార్తలు ఉండటంతో వీటిలో ర్యాలీ చూడొచ్చు. అలాగే కొత్త కంపెనీల ఐపివోలకు రానుండటంతో మార్కెట్ పాజటివ్ గా లాభాల్లో కొనసాగే అవకాశాలున్నాయి.

న్యూస్ స్టాక్స్:

లారస్ ల్యాబ్స్: డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్డిఓ) ప్రముఖ ఫార్మా కంపెనీ లారస్ కు  2-డియోక్సీ-డి-గ్లూకోజ్ (2 డిజి) తయారీ మరియు మార్కెట్ చేయడానికి లైసెన్స్ మంజూరు చేసింది. మన దేశంలో కోవిడ్ -19 రోగులపై ఉపయోగం కోసం 2 డిజికి కేంద్రం అత్యవసర అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

మైండ్ట్రీ: మైండ్ట్రీ ఎల్ అండ్ టి మైండ్ట్రీ లిమిటెడ్ నుండి ఎన్ఎక్స్ టి డిజిటల్ సంస్థను రూ .198 కోట్లతో కొనుగోలును పూర్తి చేసింది. ఎన్ఎక్స్ టి టెక్నాలిజీస్ ఇంటర్నెట్ సంస్థ ఆఫ్ థింగ్స్ (ఐఒటి) మరియు ఇండస్ట్రీ 4.0 సంబంధించిన టెక్నాలజీ సాంకేతికలో అవకాశాలను సృష్టించడనానికి కృషి చేస్తుంది.

అవెన్యూ సూపర్‌మార్ట్స్: ప్రముఖ రిటైల్ సంస్థ అవెన్యూ అవెన్యూ సూపర్‌మార్ట్స్ (డిమార్డ్) జూన్ 2021 (Q1 FY22) తో ముగిసిన త్రైమాసికంలో 31.27% శాతం ఆదాయంతో 5,031.75 కోట్ల రూపాయల లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో (క్యూ 1 ఎఫ్‌వై 21) రూ.3,833.23 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.

హెచ్‌సిఎల్: ప్రముఖ ఐటీ సేవాల కంపెనీ హెచ్‌సిఎల్ . హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ ఫిన్‌లాండ్‌కు చెందిన ఫిస్కార్స్ గ్రూపుతో బహుళ సంవత్సరాల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా హెచ్‌సిఎల్ టెక్ ఫిస్కార్స్ సంస్థకు ఐటి మరియు డిజిటల్ సేవలను అందించనుంది. ఫిస్కర్స్ ఓజ్ అబ్ప్ యూరప్, అమెరికా మరియు ఆసియా పసిఫిక్ అంతటా వినియోగదారులకు వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్ చేస్తుంది.

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

DMART, HCL, MindTree, Laurus Labs, Mangalam Cement, Marico, Apollo Tyres.

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 34,700, రెసిస్టెన్స్ లెవెల్ 34,910గా పరిగణించాల్సి వుంటుంది. అదే విధంగా నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 15,650 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,810 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *