గ్లోబల్ ఫ్యూచర్ ఇండిసిస్ భేష్…బుల్ జోరు కొనసాగుతుందా?

అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు అందడంతో మన మార్కెట్లు రికార్డులను నిలుపుకుంటున్నాయి. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కన్సూమర్ ప్రైస్ ఇండిక్స్ మార్చి మరియు ఏప్రిల్ నెల కంటే మెరుగ్గా వుండటం మరియు నిరుద్యోగుల క్లయిమ్స్ 15 నెలల కనిష్ఠంతో 3.76 లక్షలకు చేరండంతో పాటు ఆసియా, యూరప్ మార్కెట్ల నుంచి కూడా సానుకూల పవనాలు వీచడంతో నిఫ్టీ నష్టాల నుంచి రికవరీ అయ్యి లాభాల్లో రాణించింది. ఇదే ధోరణి ఈ రోజు కూడా కొనసాగి క్రొత్త రికార్డులను తాకే అవకాశం వుంది. అదే విధంగా అమెరికా మార్కెట్లు డొజోన్స్ 0.35 శాతం లాభాపడగా, నాస్ డాక్ ఫ్యూచర్స్ గరిష్ఠంగా 0.48 శాతంతో 108 పాయింట్లు పెరిగింది. నిన్నటి ట్రేడింగ్ లో విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,328 కోట్ల విలువైన షేర్లను కొనుగోళ్ళు చేయగా దేశీయ ఇన్వెస్టర్లు రూ.576 కోట్ల విలువైన షేర్లను అమ్మారు.

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

AksharChemBEMLBharat Gears
BHELCG PowerCochin Shipyard
Deccan CementsDLFJL Morison
Sun TV NetworkVishal FabricsPatel Eng

 

న్యూస్ స్టాక్స్:

జెఎస్‌డబ్ల్యు స్టీల్: దిగ్గజ స్టీల్ కంపెనీ జెఎస్‌డబ్ల్యు స్టీల్ లిమిటెడ్ ముడి ఉక్కు ఉత్పత్తిలో 10% శాతం వృద్ధిని మే నెలలో నమోదు చేసింది. దీంతో ఉత్పత్తి 13.67 లక్షల టన్నులకు (ఎల్‌టి) చేరింది.

మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్: కంపెనీ ఫలితాలు మార్చి నెలాఖరు (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 247 శాతం పెరిగి రూ .259.14 కోట్లకు చేరుకుంది. 2020-21 ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 9.09% పెరిగి 513.89 కోట్లకు ఆదాయం చేరుకుంది. ఈ కంపెనీ ఓడలు, జలాంతర్గాములు నిర్మించి మరమ్మత్తులను చేస్తుంది.

అఫ్లే ఇండియా: అమెరికాకు చెందిన మొబైల్ మార్కెటింగ్ సంస్థ జాంప్‌ను అఫ్లే ఇండియా కొనుగోళు చేయనుంది.

సెరా శానిటరీవేర్: సెరా శానిటరీవేర్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభంలో 22.91 శాతం పెరిగి ఆదాయం రూ .45.76 కోట్లకు చేరింది. మార్చి 31, 2021 (ఎఫ్‌వై 21) తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 11.02 శాతం తగ్గి సంవత్సర ఆదాయం 100.77 కోట్లకు పరిమితమైంది. ఈ సందర్భంగా కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు 13 రూపాయల డివిడెండ్‌ను ప్రకటించింది.

ఎన్‌హెచ్‌పిసి: జాతీయ జలవిద్యుత్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పిసి) మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ .464.60 కోట్లకు 80 శాతం వృద్ధిని నమోదు చేసింది.

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Cochin Shipyard, Affle India, NHPC, JSW Steel, MAZDOCK, HDFC, Alkem Labs.

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 35,010, రెసిస్టెన్స్ లెవెల్ 35,380 గా పరిగణించాల్సి వుంటుంది. అదే విధంగా నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 15,687 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,810 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *