గ్లోబల్ ఇండిసిస్ రివర్స్? నష్టాల్లో మార్కెట్లు?

జాతీయ, అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటంతో నిన్నటి మార్కెట్లు లాభాల్లో రాణించాయి. గత నాలుగు రోజులుగా నిఫ్టీ 446 పాయింట్లు పైగా లాభాపడింది. ఒక వైపు కొవిడ్ భయాలు ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా అందుకుంటున్న సంకేతాలతో మన మార్కెట్లు వరుస లాభాల్లో ముగుస్తున్నాయి. ఇదిలా వుంటే నిన్నటి ట్రేడింగ్ సెషన్లో దాదాపు అన్ని గ్లోబల్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. దీనికి ప్రధాన కారణాలుగా అమెరికా నిరుద్యోగ అంచనాలు రేటు పెరగడం అలాగే ఇండియాలో వ్యాప్తి చెందుతున్న కొత్త రకం కరోనా వైరస్ లు చెప్పుకోవచ్చు. ఈ రోజు సింగపూర్ నిఫ్టీ 200 పాయింట్లకు పైగా కోల్పోయి 14,779 వద్ద ట్రేడ్ కొనసాగుతుంది. అలాగే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించడంతో మదుపరులు అచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో సూచీలు ఊగిసలాట దిశగా ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో నిఫ్టీ గరిష్ట స్థాయిల వద్ద మదుపరులు లాభాలు స్వీకరించడంతో నిఫ్టీ 15,000 మార్కు దాటడం మార్కెట్ కి సవాల్ గా మారింది. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు మార్కెట్లు ఒడుదొడుకుల మధ్య నష్టాల్లో ట్రేడ్ అయ్యే అవకాశాలున్నాయి.

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

Aarti IndAlembicAndhra Paper
BASFGodrej ConsumerKalpataru Power
KEC IntlMahindra EPCSiemens

 

న్యూస్ స్టాక్స్:

జైడస్ వెల్నెస్: జైడస్ వెల్నెస్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 92.66% పెరుగుదలను 133.13 కోట్ల రూపాయలకు పెరిగింది. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో గత ఏడాదితో పోల్చుకుంటే నిరక లాభం 16.22 శాతం 118 కోట్ల ఆదాయం తగ్గినప్పటికీ ఈ-కామర్స్ వ్యాపారంలో 250 శాతం వృద్ధి రేటు కనబరిచింది. ఈ సందర్భంగా కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు 5 రూపాయల తుది డివిడెండ్‌ను సిఫారసు చేసింది.

వెంకీ: మార్చితో ముగిసిన త్రైమాసికంలో (క్యూ 4 ఎఫ్‌వై 21) నికర లాభం రూ .77.90 కోట్లు ఆదాయాన్ని ఆర్జించింది. ఈ సందర్భంగా వెంకి బోర్డు (ఇండియా) ఒక్కో షేరుకు రూ .17 డివిడెండ్‌ను ప్రకటించింది.

హెచ్‌ఎఫ్‌సిఎల్: మార్చి ముగిసిన త్రైమాసికంలో (క్యూ 4 ఎఫ్‌వై 21) రూ .84.67 కోట్ల నికర లాభాన్ని హెచ్‌ఎఫ్‌సిఎల్ లిమిటెడ్ సాధించింది. ఈ సందర్భంగా హెచ్‌ఎఫ్‌సిఎల్ బోర్డు ఒక్కో షేరుకు 0.15 తుది డివిడెండ్‌ను సిఫారసు చేసింది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Sun Pharma, EXID Industries, JSW Steel, KEC International, Godrej Consumer.

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 33,053, రెసిస్టెన్స్ లెవెల్ 33,258 గా పరిగణించాల్సి వుంటుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14,611 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,051 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

అంతర్జాతీయంగా సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *