గ్లోబల్ ఇండిసిస్ డౌన్…కాన్సాలిడేషన్ దిశగా సూచీలు?

ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కరోనా కలవరం మొదలయ్యింది. మూడో దశ చాపకింద నీరులా దాడి చేయనుందని డబ్య్లుహెచ్ వో స్పష్టం చేస్తుండటంతో మదుపరులు అప్రమత్తతో లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. నిన్నటి ట్రేడింగ్ లో అంతర్జాతీయంగా అందుకున్న సంకేతాలతోపాటు హెచ్‌డిఎఫ్‌సి షేర్ల పతనంతో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కుదేలయ్యాయి. ఈ రోజు కూడా ఆసియా మార్కెట్లు టోక్యో, షాంఘై మార్కెట్ల సూచీలు నష్టాలతోనే ఆరంభమయ్యాయి. దీంతో సింగపూర్ నిఫ్టీ కాన్సాలిడేషన్ దిశగా సూచీలు కదలాడుతున్నాయి. ఇదే ధోరణి ఈ రోజు మార్కెట్లో కొనసాగే అవకాశాలున్నాయి. దిగ్గజ కార్పొరేట్ కంపెనీల ఫలితాలు వెలువడనున్నప్పటికీ లాభాల స్వీకరణతో మార్కెట్ గమనం నష్టాల వైపే చూపుతున్నాయి. ఇక అంతర్జాతీయంగా యూస్ మార్కెట్ల సూచీలు తీవ్ర నష్టాల్లో ముగిశాయి.

 

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

Asian PaintsBajaj FinanceCRISIL
ICICI PrudentiaICICI SecuritiesJubilant Ingrev
Mangalam OrganRel Ind InfraShyam Metalics

 

న్యూస్ స్టాక్స్:

హెచ్‌సిఎల్: హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ జూన్ (క్యూ 1 ఎఫ్‌వై 22) తో ముగిసిన త్రైమాసికంలో  నికర లాభం రూ .3,213 కోట్లకు 9.4 శాతం పెరిగిందని కంపెనీ తెలిపింది. కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 12.5% శాతం ​​పెరిగి ఆదాయం 20,068 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ సందర్భంగా కంపెనీ బోర్డు ప్రతి షేరుకు రూ .6 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది.

ఎసిసి: జూన్ ముగిసిన త్రైమాసికంలో (క్యూ 2 సివై 21) ఏసిసి లిమిటెడ్ నికర లాభం 110 శాతం పెరిగి 569.45 కోట్ల రూపాయలకు చేరుకుంది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 49.29% పెరిగి 3,884.94 కోట్ల రూపాయలకు చేరుకుంది.

హెచ్‌డిఎఫ్‌సి లైఫ్: హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో (క్యూ 1 ఎఫ్‌వై 22) నికర లాభం రూ .302 కోట్లకు 33% తగ్గింది. కొవిడ్ కారణంగా అధికంగా క్లెయిమ్ చెల్లింపులు సంస్థ ఆదాయం పడిపోయింది. హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ క్యూ 1 లో 70,000 క్లెయిమ్‌లను చెల్లించింది.

ఇండియన్ బ్యాంక్: ప్రభుత్వరంగ సంస్థ ఇండియాన్ బ్యాంక్ జూన్ ముగిసిన త్రైమాసికంలో (క్యూ 1 ఎఫ్‌వై 22) ఇండియన్ బ్యాంక్ నికర లాభం 220 శాతం పెరిగి 1,182 కోట్ల రూపాయలకు చేరుకుంది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 31% తగ్గింది. అదే సమయంలో దాని నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 3% పెరిగి రూ .3,994 కోట్లకు చేరుకుంది.

నిప్పాన్ ఇండియా: నిప్పాన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (నామ్ ఇండియా) జూన్ తో ముగిసిన త్రైమాసికంలో (క్యూ 1 ఎఫ్‌వై 22) నికర లాభం 16 శాతం పెరిగి రూ .181.54 కోట్లకు చేరుకుంది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 8.8% పెరిగింది. ఇదే కాలంలో మొత్తం ఆదాయం 10% పెరిగి 369.18 కోట్ల రూపాయలకు చేరుకుంది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Indian Bank, ZENTEC, ACC, HCL, Jubilant Ingrevia

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 34,970, రెసిస్టెన్స్ లెవెల్ 35,320 గా పరిగణించాల్సి వుంటుంది. అదే విధంగా నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 15,690 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,800 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

అంతర్జాతీయ ప్రతికూలతల నేపథ్యంలో మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *