గ్రీన్ డే టూడే? రికార్డ్ హైలో అమెరికా మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో మన మార్కెట్లు నష్టాలకు బ్రేక్ వేసి గత రెండు రోజులుగా లాభాల్లో కొనసాగుతున్నాయి. నిన్నటి ట్రేడింగ్ సెషన్లో ఒడుదొడుకులు ఉన్నప్పటికీ ఆటో మోబైల్, ఐటీ షేర్లు రాణించడంతో స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఇదిలా వుంటే అమెరికా మార్కెట్లు రికార్డ్ హైలో ట్రేడవ్వడంతో పాటు ఆసియా, యూరప్ మార్కెట్లు సైతం లాభాల్లో కొనసాగుతున్నాయి. దేశీయంగా కొవిడ్ నియంత్రణకు సత్వర నివారణ చర్యలు తీసుకుండటంతో మన మార్కెట్ పై మదుపరులకు ఆశలు రేకిస్తున్నాయి. అయితే కొత్త కేసులు విషయంలో మాత్రం తగ్గుదల కనిపించడం లేదు. ఈ రోజు హెచ్ డి ఎఫ్ సి ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లాభాల్లో కొనసాగే అవకాశాలున్నాయి. దీనికి తోడు సింగపూర్ నిఫ్టీ 67 పాయింట్ల లాభంతో 14847 వద్ద ట్రేడ్ అవుతుంది.

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

Chola Invest.Dabur IndiaHDFC
Navin FluorineReliance PowerSteel Str Wheel
UltraTechCementTanfac IndGE Shipping

 

న్యూస్ స్టాక్స్:

టాటా కన్స్యూమర్: టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో 133.34 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో టాటా కన్స్యూమర్ 7 ప్రధాన నగరాల్లో 39 చోట్ల అమ్మకాలను మొదలుపెట్టింది. ఈ సందర్భంగా ఎఫ్‌ఎంసిజి సంస్థ బోర్డు ఒక్కో షేరుకు రూ .4.05 తుది డివిడెండ్ ప్రకటించింది.

కోఫోర్జ్: కోఫోర్జ్ లిమిటెడ్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ .133 కోట్లకు 17.08% పెరిగింది. ఈ త్రైమాసికంలో కంపెనీ సుమారు 201 మిలియన్ డాలర్ల (రూ.48 1,482 కోట్లు) ఆర్డర్లను దక్కించుకుంది. ఈ సందర్భంగా కోఫోర్జ్ బోర్డు ఒక్కో షేరుకు 13 రూపాయల డివిడెండ్ ప్రకటించింది.

ప్రాజ్ ఇండస్ట్రీస్: మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో ప్రాజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నికర లాభం 109.21% పెరిగి 52 కోట్లకు పెరిగింది. కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు రూ .2.16 తుది డివిడెండ్‌ను సిఫారసు చేసింది.

హీరో మోటోకార్ప్: ఆటో మోబైల్ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికరలాభం 44 శాతం పెరిగి రూ.885 కోట్లు. అయితే సంవత్సరం ఆదాయం 20 శాతం క్షీణించి రూ.2,936 కోట్లకు చేరింది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Tata Consumer, Bajaj HealthCare, Dabur India, HDFC, HDFC Bank

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 32,268, రెసిస్టెన్స్ లెవెల్ 33,061 గా పరిగణించాల్సి వుంటుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14,416 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 14,855 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

దేశీయంగా మరియు అంతర్జాతీయంగా మార్కెట్లు సానుకూలంగా ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *