గ్యాప్ అప్? సానుకూలంగా గ్లోబల్ సూచీలు

కరోనా భయందోళనలతో వరుసగా మూడో రోజు కూడా నిఫ్టీ నష్టాల్లోనే ముగిసింది.  బుధవారం బక్రీద్ సందర్భంగా ఇండియా మార్కెట్లు పనిచేయనప్పటికీ ప్రపంచ మార్కెట్లు యధావిధిగా కొనసాగడంతో యూస్ మార్కెట్లు నష్టాల నుంచి లాభాల బాటలో రాణిస్తున్నాయి. ఇదిలా వుంటే కరోనా ఉధృతి రానున్న మూడు నుంచి ఆరు నెలల్లో తీవ్రంగా వుంటుందని డబ్య్లుహెచ్ వో తోపాటు పలు ఆరోగ్య సంస్థల సర్వేలు హెచ్చరిస్తున్నాయి. దీంతో మదుపరులు ఆచితూచి తమ పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. ఐటీ సంస్థలు మెరుగైన ఫలితాలు వెల్లడిస్తుండటంతోపాటు కొత్త ఒప్పందాలు చేసుకుండటంతో ఈ రోజు ట్రేడింగ్ లో ఐటీతో  మెటల్ షేర్లలో ర్యాలీ వుండొచ్చు. అదే విధంగా ఈ రోజు విక్లీ ఎక్సపయిరీ వుండటంతో సూచీల్లో వాలటల్టీ ఉన్నప్పటికీ నిఫ్టీ లాభాల్లో ముగిసే అవకాశాలున్నాయి.

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

Bajaj AutoBajaj HoldingsAgro Tech Foods
BioconHind ZincMphasiS
UltraTechCementVimta LabsSuper Sales

 

న్యూస్ స్టాక్స్:

శ్యామ్ మెటాలిక్స్: శ్యామ్ మెటాలిక్స్ మరియు ఎనర్జీ కంపెనీ జూన్  త్రైమాసికంలో (క్యూ 1 ఎఫ్‌వై 22) నికర లాభంలో 470.4 శాతం వృద్ధితో రూ. 457 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 18.2% పెరిగింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 170% YOY పెరిగి 2,464 కోట్ల రూపాయలకు చేరుకుంది.

క్రిసిల్: ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ నికర లాభం 51 శాతంతో రూ .100 కోట్లకు పెరిగింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 12% YOY పెరిగి 528.5 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ సందర్భంగా కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు రూ .8 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది.

విప్రో: క్లౌడ్ ట్రాన్స్ఫర్మేషన్ సామర్థ్యాలను విస్తరించడానికి వచ్చే మూడేళ్లలో వన్ బిలియన్ డాలర్ల ((7,465 కోట్ల రూపాయలు)  పెట్టుబడి పెట్టనున్నట్లు విప్రో ప్రకటించింది.

బజాజ్ ఫిన్సర్వ్:. జూన్ ముగిసిన త్రైమాసికంలో (క్యూ 1 ఎఫ్‌వై 22) నికర లాభం 31.5 శాతం తగ్గి ఆదాయం 832.7 కోట్లకు చేరుకుంది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 14.9% తగ్గింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 1.7% YOY (లేదా 9.34% QoQ) 13,949.5 కోట్లకు పడిపోయింది.

హావెల్స్‌ ఇండియా: జూన్ ముగిసిన త్రైమాసికంలో (క్యూ 1 ఎఫ్‌వై 22) ఏకీకృత నికర లాభం 268.5 శాతం పెరిగి రూ .235.78 కోట్లకు చేరుకుంది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 22.4% తగ్గింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం 75.95% పెరిగి 2,609.97 కోట్ల రూపాయలకు చేరుకుంది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Wipro, SHYAMMETL, Havells India, CRISIL, Mphasis

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 34,420, రెసిస్టెన్స్ లెవెల్ 34,660 గా పరిగణించాల్సి వుంటుంది. అదే విధంగా నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 15,640 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,725 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *