కాన్సాలిడేషన్ దిశగా సూచీలు? స్తబ్ధుగా గ్లోబల్ మార్కెట్లు

దేశీయంగా అందుకున్న సానుకూల సంకేతాలతో గ్లోబల్ మార్కెట్ల సూచీలు మిశ్రమంగా ట్రేడ్ అయినప్పటికీ నిన్నటి ట్రేడింగ్ లాభాల్లో రాణించింది. బ్యాంకింగ్, మెటల్ షేర్ల కొనుగోళ్ళతోపాటు రిలయన్స్ లాభాల్లో ట్రేడ్ అవ్వడంతో మార్కెట్ ఆరంభం నుంచి ముగింపు వరకు సూచీలు లాభాల దిశగానే కొనసాగాయి. ఇదిలావుంటే ఈ రోజు ఆసియా మార్కెట్లు లాభాల్లో ఓపెన్ అయినప్పటికీ షాంఘై మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతుండటంతో సింగపూర్ నిఫ్టీ కూడా నష్టాల్లో కొనసాగుతుంది. దీంతో ఈ రోజు సూచీలు కాన్సాలిడేషన్ లో వుంటే అవకాశాలున్నాయి. దేశీయంగా సేవల రంగ పిఎంఐ గణాంకాలు దిగజారినప్పటికీ మార్కెట్ సానుకూలంగా స్పందించడం విశేషం. అంతర్జాతీయంగా అమెరికాలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అక్కడి మార్కెట్లు పనిచేయలేదు.

న్యూస్ స్టాక్స్:

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్: దిగ్గజ ప్రయివేట్ సెక్టార్ బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జూన్ 30 తో ముగిసిన త్రైమాసికంలో (క్యూ 1 ఎఫ్‌వై 22) లో 14% శాతం రుణ వృద్ధిని 11.47 లక్షల కోట్ల రూపాయలకు నమోదు చేసింది. గడిచిన త్రైమాసికంతో పోలిస్తే రుణ పురోగతి 1.3% పెరిగింది.

ఐటిడి సిమెంటేషన్: ఐటిడి సిమెంటేషన్ సుమారు 585 కోట్ల రూపాయల విలువైన రెండు ఆర్డర్‌లను దక్కించుకుంది. దీనిలో భాగంగా సూరత్ మెట్రో రైల్ ప్రాజెక్టు మొదటి దశకు సంబంధించి ఎలక్ట్రికల్, మెకానికల్ పనులతో సహా ‘డ్రీమ్ సిటీ డిపో’ అభివృద్ధి మరియు నిర్మాణం ఉంటుంది. అలాగే ఢిల్లీలోని పాలంలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద ఏరో స్పేస్ మ్యూజియం నిర్మాణం చేపట్టనుంది.

టాటా కమ్యూనికేషన్స్: టాటా కమ్యూనికేషన్స్ లిమిటెడ్ వర్చువల్ వీడియో అసిస్టెడ్ రిఫరీ (V-VAR) ప్రారంభించినట్లు ప్రకటించింది. దీంతో అపరిమిత సంఖ్యలో రిఫరీలను, న్యాయమూర్తులను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుండైనా రిమోట్‌గా కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది.

ఎన్‌ఎమ్‌డిసి:ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎమ్‌డిసి) ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా ప్రభుత్వం లో 7.49% వాటాను విక్రయించనుంది. కేంద్రం తన 4% వాటాను (లేదా 11.72 కోట్ల ఈక్విటీ షేర్లను) ఎన్‌ఎండిసిలో ఫ్లోర్ ధరకు ఒక్కో షేరును 165 రూపాయల కనీస ధరకు విక్రయించనుంది. OFS పూర్తయిన తరువాత NMDC లో ప్రభుత్వ వాటా 60.8% కి తగ్గుతుంది. గత సంవత్సర కాలంగా NMDC రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జిస్తుంది.

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

NMDC, Apex frozen foods, IOL Chemicals, Tata Power, JSW Steel

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 35,050, రెసిస్టెన్స్ లెవెల్ 35,300గా పరిగణించాల్సి వుంటుంది. అదే విధంగా నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 15,780 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,890 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *