కాన్సాలిడేషన్ దిశగా సూచీలు? నేడే రిలయన్స్ ఏజీఎం మీటింగ్

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో సూచీలకు గరిష్ఠ స్థాయిల్లో లాభాల స్వీకరణ ఎదురవ్వడంతో నిన్నటి ట్రేడింగ్ లో నష్టాలు చవిచూశాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లు సైతం మిశ్రమంగా నష్టాల్లో ముగిశాయి. ఈ రోజు రిలయన్స్ ఎజీఎం మీటింగ్ మార్కెట్ కు కీలకం కానుంది. అలాగే జూన్ సిరీస్ విక్లీ, మంత్లీ డెరివేటివ్ కాంట్రాక్టులు నేటితో ముగియనుంది. కాబట్టి వీటన్నిటిని మదుపరులు జాగ్రత్తగా గమనిస్తూ తమ పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. దీంతో ఈ రోజు సూచీలు తీవ్ర ఒడుదుడుకుల మధ్య కాన్సాలిడేషన్ దిశగా కదలాడే అవకాశాలున్నాయి

న్యూస్ స్టాక్స్:

హెచ్‌సిసి: హిందూస్తాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ (హెచ్‌సిసి) లిమిటెడ్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 49.48 శాతం తగ్గి రూ.157.28 కోట్లకు చేరుకుంది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 32.64% పెరిగింది. కోవిడ్ -19 ప్రభావం వల్ల ఏర్పడిన ఆర్థిక మందగమనం నుంచి తమ గ్రూప్ కంపెనీల కార్యకలాపాలు కోలుకోవడం ప్రారంభించింది సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.

స్పెషాలిటీ రెస్టారెంట్లు: మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 122 శాతం పెరిగి రూ .8.4 కోట్లకు చేరుకుంది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 328.5% పెరిగింది. ఇదే కాలంలో మొత్తం ఆదాయం 4.5% తగ్గి ఆదాయం రూ.75.17 కోట్లకు చేరుకుంది. 2020-21 (ఎఫ్‌వై 21) ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ .29.45 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది.

డాబర్: ప్రముఖ ఎఫ్‌ఎంసిజి సంస్థ డాబర్ ఇండియా లిమిటెడ్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సమీపంలో అతి పెద్ద ఉత్పాదక నిర్మాణాన్ని సుమారు రూ.550 కోట్ల పెట్టుబడితో ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది.

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Tata Motors, Dabur, UBL, Infosys

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 34,6280, రెసిస్టెన్స్ లెవెల్ 35,150 గా పరిగణించాల్సి వుంటుంది. అదే విధంగా నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 15,574 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,800 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *