కాన్సాలిడేషన్ దిశగా సూచీలు…బుల్ ట్రెండ్ కొనసాగుతుందా?

గతవారం మార్కెట్లు అంతర్జాతీయంగా అందుకున్న సంకేతాలతో లాభాల్లో రాణించి రికార్డు స్థాయిలో ముగిశాయి. ఈ వారం కూడా మార్కెట్లు అంతర్జాతీయంగా అందుకునే సంకేతాలను బట్టే ట్రెడ్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ వారంలో అమెరికాలో ఫెడ్ రిజర్వు నుంచి వడ్డీ రేట్లపై మరియు ద్రవ్య పరిపతి విధానాలపై నిర్ణయాలు బుధవారం వెలువడనున్నాయి దీంతో పాటుగా జపాన్, చైనా పారిశ్రామికోత్పత్తి గణాంకాలు కూడా మార్కెటును ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. అలాగే దేశీయంగా కరోనా సంబంధిత పలు సానుకూల అంశాలు ఉన్నప్పటికీ మే నెలకు సంబంధించిన రిటైల్, వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు నేడు విడుదలకానున్నాయి అలాగే ఎగుమతుల, దిగుమతులకు సంబంధించిన గణాంకాలు మంగళవారం వెల్లడి కానుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తతో వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. అదే విధంగా పలు రంగాల షేర్లు ఇప్పటికే గరిష్ఠ స్థాయిల్లో ట్రేడ్ అవుతుండటంతో లాభాల స్వీకరణ జరిగే అవకాశం లేకపోలేదు. వీటిన్నిటి దృష్య్టా ఈ రోజు సూచీలు కాన్సాలిడేషన్ దిశగా ఒడుదుడుకుల మధ్య కొనసాగే అవకాశాలున్నాయి.

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

Aditya VisionArihant CapitalCoal India
Globus SpiritsIDFCJB Chemicals
Singer IndiaThejo EnggRamky Infra

 

న్యూస్ స్టాక్స్:

జె కె సిమెంట్: జె కె సిమెంట్ లిమిటెడ్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ.215.91 కోట్లతో 32.76 శాతం పెరిగింది. మార్చి 31, 2021 (ఎఫ్‌వై 21) తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 44.14 శాతం పెరుగుదలతో రూ .709.71 కోట్లకు చేరుకుంది. ఈ సందర్భంగా కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు 15 రూపాయల డివిడెండ్‌ను సిఫారసు చేసింది.

భెల్: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్) మార్చితో ముగిసిన త్రైమాసికంలో (క్యూ 4 ఎఫ్‌వై 21) రూ.1,034.82 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో (క్యూ 4 ఎఫ్‌వై 20) రూ .1,532.67 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. క్యూ 4 ఎఫ్‌వై 21 లో దీని మొత్తం ఆదాయం 40.23% పెరిగి 7,245.16 కోట్లకు చేరుకుంది.

అనుపమ్ రసయన్: మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 113 శాతం పెరిగి రూ .22 కోట్లకు చేరుకుంది. 2020-21 (ఎఫ్వై 21) ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 32.12% పెరిగి రూ .70.29 కోట్లకు చేరుకుంది. కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు 0.5 రూపాయల డివిడెండ్ ప్రకటించింది.

సెయిల్: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) మార్చి నెలతో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 31 శాతం పెరిగి రూ .3,469.88 కోట్లకు పెరిగింది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 136.34% పెరిగింది. 2020-21 (ఎఫ్వై 21) ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 95.6% పెరిగి రూ .4,148.13 కోట్లకు చేరుకుంది. సెయిల్ బోర్డు ఒక్కో షేరుకు రూ .1.80 తుది డివిడెండ్ ప్రకటించింది.

కొచ్చిన్ షిప్‌యార్డ్: కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 71.76% శాతంతో ఆదాయం రూ.236.21 కోట్లకు పెరిగింది. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 3.7% తగ్గి సంవత్సర ఆదాయం 608.66 కోట్లకు పరిమితమైంది. కొచ్చిన్ షిప్‌యార్డ్ బోర్డు ఒక్కో షేరుకు రూ .2.50 తుది డివిడెండ్‌ను ప్రకటించింది.

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

BHEL(SELL), Sail, Anupam Rasayan, JK Cement, Cochin Shipyard, DLF, SunTv, Coal India.

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 34,757, రెసిస్టెన్స్ లెవెల్ 35,380 గా పరిగణించాల్సి వుంటుంది. అదే విధంగా నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 15,750 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,860 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

దేశీయంగా, అంతర్జాతీయంగా కీలక పరిణామాల జరగనున్న నేపథ్యంలో మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *