కాన్సాలిడేషన్ దిశగా సూచీలు.. నిఫ్టీ 16,000?

నిన్నటి ఇంట్రాడేలో నిఫ్టీ సుమారు 103 పాయింట్లు పెరిగి 15,773 వద్ద జీవిత కాల గరిష్ఠ స్థాయిలను తాకింది. స్మాల్ కాప్, మిడ్ కాప్ షేర్ల కొనుగోళ్ళతో కాన్సాలిడేషన్లో సూచీలు కదలాడుతూ లాభాల్లో ముగిశాయి. నిఫ్టీని ముందుకు నడిపించే రిలయన్స్ షేర్ లో మూమెంట్ బలంగా వుండటంతోపాటు రానున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం బ్యాంకింగ్ మరియు ఇన్సూరెన్స్ సెక్టార్ లో మార్పులు చేపట్టే అవకాశాలున్నాయనే వార్తలతో నిఫ్టీ రికార్డు స్థాయిలో 16,000 మార్కుకు ఎగబాకే అవకాశాలున్నాయి లేదా గరిష్ఠ స్థాయిల్లో లాభాల స్వీకరణ వచ్చే అవకాశం ఉంది. ఇక అంతర్జాతీయంగా అమెరికాలో కార్పొరేట్ వర్గాలపై సుమారు 15శాతం అధిక పన్ను చెల్లించే దిశగా చర్యలు తీసుకుండటంతో యూస్ మార్కెట్లతోపాటు మిగితా గ్లోబల్ మార్కెట్లు నష్టాల్లో ఫ్లాట్ గా ముగిశాయి. దీంతో మార్కెట్లు ఈ రోజు సూచీలు ఒడుదుడుకుల మధ్య కాన్సాలిడేషన్ లో ముగిసే అవకాశాలున్నాయి.

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

Bajaj HindusthaEngineersIndHester Bio
Ion ExchangeMax FinancialMysore Petro
Petronet LNGSal AutomotiveSuyog Tele

 

న్యూస్ స్టాక్స్:

MRF: ప్రముఖ టైర్ల ఉత్పతి సంస్థ MRF లిమిటెడ్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 51.1% తగ్గి 332.15 కోట్ల రూపాయలకు పడిపోయింది. దీంతో నిన్నటి ట్రేడింగ్ లో 3 శాతం పైగా నష్టపోయింది. కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు తుది డివిడెండ్ 94 రూపాయలు మరియు ఒక్కో షేరుకు రూ .50 ప్రత్యేక డివిడెండ్‌ను ప్రకటించింది.

ఎల్ అండ్ టి: దిగ్గజ భవన నిర్మాణ సంస్థ లార్సెన్ & టౌబ్రో (ఎల్ అండ్ టి) సుమారు రూ.2,500 కోట్ల విలువైన ఆర్డర్లను కర్ణాటక మరియు ఒడిశా ప్రభుత్తాల నుంచి దక్కించుకుంది.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చి 2021 (క్యూ 4 ఎఫ్‌వై 21) తో ముగిసిన త్రైమాసికంలో 1,349.21 కోట్ల రూపాయల నికర నష్టాన్ని నమోదు చేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 20.84% ​​తగ్గి 887.58 కోట్లకు పరిమితమైంది.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చిలో ముగిసిన త్రైమాసికంలో (క్యూ 4) నికర లాభం 1,330 కోట్ల రూపాయల 83 శాతం పెరిగింది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Central Bank, L&T, Petronet LNG, Jubilant ingrevia, Ambuja Cement, Infosys.

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 35,340, రెసిస్టెన్స్ లెవెల్ 35,530 గా పరిగణించాల్సి వుంటుంది. అదే విధంగా నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 15,696 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,810 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లు ఫ్లాట్ గా నష్టాల్లో ముగిశాయి కాబట్టి మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *