కాన్సాలిడేషన్ దిశగా సూచీలు? లాభాల స్వీకరణ కొనసాగుతుందా?

నిన్నటి ట్రేడింగ్ సెషన్లో మార్కెట్ గాప్ అప్ ఓపెన్ అయ్యి నిఫ్టీ సుమారు 130 పాయింట్లు లాభపడడంతో గరిష్ఠ స్థాయిల వద్ద బ్యాకింగ్, ఫైనాన్స్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో మార్కెట్ ముగింపులో నష్టాల నుంచి స్వల్ప లాభాల్లో ముగిసింది. అలాగే హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ షేరుతో పాటు మిగతా బ్యాంకింగ్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవ్వడంత బ్యాంక్ నిఫ్టీ నష్టాల్లో ముగిసింది. అయితే లాక్డౌన్ నేపథ్యంలో మరో ఉద్దీపన ప్యాకేజీ ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలతో ముగింపులో రికవరీ అయ్యాయి. రేపు గురువారం విక్లీ ఎక్సపయిరీతోపాటు మంత్లీ ఎక్సపయిరీ ఉండటంతో ఈ రోజు మార్కెట్లో తీవ్ర ఒడుదుడుకుల మధ్య సూచీలు కాన్సాలిడేషన్ దిశగా కదలాడే అవకాశాలున్నాయి. అంతర్జాతీయంగా అమెరికా మార్కెట్లు మినహా మిగతా అన్నీ మార్కెట్లు సానుకూలంగా ట్రేడ్ అవుతుండటంతో మన మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిసే అవకాశాలున్నాయి.

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

Apollo FinvestBerger PaintsBPCL
Burger KingCumminsKarur Vysya
KIOCLLT FoodsPfizer
V-Guard IndVishwaraj SugarMPS

 

న్యూస్ స్టాక్స్:

టాటా పవర్: ఒడిశాలోని గంజాం వద్ద 40 మెగావాట్ల (మెగావాట్ల) సౌర విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి ఒడిశా ప్రభుత్వానికి చెందిన ఎన్‌హెచ్‌పిసి లిమిటెడ్ తో  టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ రూ.188.19 కోట్ల రూపాయల విలువైన ఇపిసి (ఇంజనీరింగ్ సేకరణ మరియు నిర్మాణం) ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

బజాజ్ ఎలక్ట్రికల్స్: మార్చి ముగిసిన త్రైమాసికంలో (క్యూ 4 ఎఫ్‌వై 21) బజాజ్ ఎలక్ట్రికల్స్ నికర లాభం రూ .54.26 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో (క్యూ 4 ఎఫ్‌వై 20) రూ 81 లక్షల నికర నష్టాన్ని నమోదు చేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో YOY కంపెనీ ఆదాయం క్యూ 4 ఎఫ్‌వై 21 లో 3.25% శాతం తగ్గి 1,258.47 కోట్లకు చేరుకుంది.

ఎమామి: మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో ఎమామి లిమిటెడ్ మూడు రెట్లు (~ 275%) ఏకీకృత నికర లాభం రూ .87.73 కోట్లకు పెరిగింది. మార్చి 31, 2021 (ఎఫ్‌వై 21) తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 50% పెరిగి 454.7 కోట్ల రూపాయలకు చేరుకుంది.

టీవీఎస్ శ్రీచక్రా: టివిఎస్ శ్రీచక్రా లిమిటెడ్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ.35 కోట్లకు 44.75% పెరిగింది. మార్చి 31, 2021 (ఎఫ్‌వై 21) తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 10.23 శాతం తగ్గి రూ.73.92 కోట్లకు చేరుకుంది. ఈ సందర్భంగా బోర్డు ఒక్కో షేరుకు రూ .30 డివిడెండ్ ప్రకటించింది.

ఆల్కెమ్ ల్యాబ్: ఆల్కెం లాబొరేటరీస్ లిమిటెడ్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 27.1% పెరిగి రూ .239.99 కోట్లకు పెరిగింది. మార్చి 31, 2021 (ఎఫ్‌వై 21) తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 40.6 శాతం పెరిగి రూ .1,585 కోట్లకు చేరుకుంది. ఈ సందర్భంగా కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు 5 రూపాయల డివిడెండ్ ప్రకటించింది.

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

TataPower, BPCL,GRASIM,ITC, Berger Paints, KIOCL, Alkem Labs, Emami

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 34,450, రెసిస్టెన్స్ లెవెల్ 34,895 గా పరిగణించాల్సి వుంటుంది. అదే విధంగా నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 15,138 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,310 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

దేశీయంగా, అంతర్జాతీయంగా సానుకూలతలు ఉన్నప్పటికీ గరిష్ఠ స్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరుగుతుంది కాబట్టి కాబట్టి మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *