కాన్సాలిడేషన్ దిశగా మార్కెట్లు? గ్లోబల్ ఇండిసిస్ డౌన్.

దేశీయ, అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా వుండటంతో గత రెండు రోజులుగా మార్కెట్లు రికార్డ్ హై ని మరోసారి నమోదు చేశాయి. ఇదిలా వుంటే నిన్నటి ట్రేడింగ్ సెషన్ లో ప్రపంచ మార్కెట్ల సూచీలు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. దీంతో సింగపూర్ నిఫ్టీ సుమారు 80 పాయింట్లు పైగా కోల్పోయి 15,070 వద్ద ట్రేడ్ కొనసాగుతుంది. అమెరికా ఫెడ్ రిజర్వు సమావేశ ఫలితాలు నేడు వెలువడనున్న నేపథ్యంలో  ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనిస్తూ నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ రోజు మన మార్కెట్లు కాన్సాలిడేషన్ దిశగా ఒడుదుడుకుల మధ్య ట్రేడ్ అయ్యే అవకాశాలున్నాయి.

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

Clariant ChemEndurance TechnGravita India
Heritage FoodsIndiabulls HsgIOC
JK Tyre & IndTCI ExpressVishnu Chemical

న్యూస్ స్టాక్స్:

టాటా మోటార్స్: దిగ్గజ ఆటో మోబైల్ సంస్థ టాటా మోటార్స్ మార్చితో ముగిసిన త్రైమాసికంలో (క్యూ 4 ఎఫ్‌వై 21) రూ .7,605.4 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 106% శాతంతో YOY ఆదాయాన్ని 20,046 కోట్ల రూపాయలుగా నమోదు చేసింది.

కెనరా బ్యాంక్: కెనరా బ్యాంక్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో 1,011 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో (క్యూ 4 ఎఫ్‌వై 20) రూ.3,259 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది.

జ్యోతి ల్యాబ్స్: జ్యోతి ల్యాబ్స్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభంలో 2.59% శాతం పెరుగుదలతో రూ.27.28 కోట్లకు పెరిగింది. ఈ సందర్భంగా కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు రూ.4 తుది డివిడెండ్‌ను సిఫారసు చేసింది.

టోరెంట్ ఫార్మా: టోరెంట్ ఫార్మాస్యూటికల్స్ నికర లాభం 3.18% శాతం పెరిగి 324 కోట్లకు పెరిగింది. US మార్కెట్ నుండి వచ్చే ఆదాయం 30% YOY తగ్గి 269 కోట్లుగా నమోదు చేసింది.కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు 15 రూపాయల తుది డివిడెండ్‌ను సిఫారసు చేసింది.

ఉజ్జీవన్ ఎస్‌ఎఫ్‌బి: మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నికర లాభం 86.59% పెరిగి రూ .136.49 కోట్లకు చేరుకుంది.

అబోట్ ఇండియా: మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో అబోట్ ఇండియా నికర లాభం 37.4% పెరిగి రూ .152.47 కోట్లకు పెరిగింది. ఈ సందర్భంగా కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు తుది డివిడెండ్ 120 రూపాయలు మరియు ఒక్కో షేరుకు 155 రూపాయల ప్రత్యేక డివిడెండ్‌ను సిఫార్సు చేసింది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Gravita India, Jyothy Labs, LTI, Torrent Pharma, Endurance Technologies

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 33,780, రెసిస్టెన్స్ లెవెల్ 34,186 గా పరిగణించాల్సి వుంటుంది. అదే విధంగా నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 15,060 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,135 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

అంతర్జాతీయంగా సూచీలు మిక్సిడ్ గా నష్టాల్లో ముగిశాయి. అదే విధంగా అమెరికా ఫెడ్ రిజర్వు సమావేశం ఫలితాలు ఉన్నాయి కాబట్టి మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *