కాన్సాలిడేషన్ దిశగా మార్కెట్లు? కీలకంకానున్న గ్లోబల్ సూచీలు

దేశీయంగా విపత్కర పరిస్థితులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో సూచీల గమనం ఎటువైపో తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది. ఇదే ధోరణితో గత వారం మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. కరోనా, బ్లాక్ ఫంగస్ విజృంభణతో  వైద్య రంగానికి పెద్ద పీట వేయడంతో ఫార్మా రంగానికి డిమాండ్ పెరుగుతోంది. ఇది మినహా మిగతా అన్నీ రంగాలు ఆర్థికంగా నష్టపోతున్నాయి. దేశీయంగా వివిధ రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగడంతోపాటు వాక్సినేషన్ ప్రకియ మరింత ఆలస్యం కావడంతో మార్కెట్ సెంటిమెంట్ ని దెబ్బతీయోచ్చు. దీంతో అంతర్జాతీయ సంకేతాల మీద ఆధారపడే మన మార్కెట్లు కదిలాడే అవకాశాలున్నాయి. ఇదిలా వుంటే ఈ వారంలో దిగ్గజ కంపెనీలు భారతీ ఎయిర్ టెల్, టొరెంటో పవర్, గోద్రేజ్, హెచ్ పి సి ఎల్, టాటా మోటార్స్ తదితర కంపెనీల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో మార్కెట్లు ఈ వారం సానుకూలంగా ట్రేడ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు.

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

Bharti AirtelColgateFederal Bank
Orient CementSubexGland

 

న్యూస్ స్టాక్స్:

ఎల్ అండ్ టి: దిగ్గజ భవన నిర్మాణ సంస్థ లార్సెన్ & టౌబ్రో (ఎల్ అండ్ టి) మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ.3,293 కోట్ల రూపాయలతో 3% శాతం పెరిగింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంతో (క్యూ 3 ఎఫ్‌వై 21) పోలిస్తే నికర లాభం 33% శాతం పెరిగింది. అదే విధంగా ఎల్ అండ్ టి చెన్నై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (సిఎంఆర్ఎల్) నుండి సుమారు 5 వేల కోట్ల రూపాయల విలువ చేసే ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు 18 రూపాయల తుది డివిడెండ్‌ను ప్రకటించింది.

సిప్లా: ప్రముఖ ఫార్మా సంస్థ సిప్లా మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 68% శాతం పెరిగి రూ .413.4 కోట్లకు చేరుకుంది. ఈ సందర్భంగా కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు 5 రూపాయల తుది డివిడెండ్‌ను ఆమోదించింది.

ఎస్కార్ట్స్: మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో ఎస్కార్ట్స్ లిమిటెడ్ నికర లాభం రెండు రెట్లు పెరిగి రూ.285.41 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ సందర్భంగా కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు 5 రూపాయల తుది డివిడెండ్ మరియు ఒక్కో షేరుకు 2.5 రూపాయల ప్రత్యేక డివిడెంట్ ని  ఆమోదించింది.

ఆదిత్య బిర్లా క్యాపిటల్: మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో ఆదిత్య బిర్లా క్యాపిటల్ నికర లాభంలో రూ .375.15 కోట్లకు 161.1 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆదిత్య బిర్లా క్యాపిటల్ జీవిత మరియు ఆరోగ్య బీమా విభాగాలలో నికర అమ్మకాలు క్యూ 4 లో 25% శాతం (YOY) పెరిగి 11,076 కోట్ల రూపాయలకు చేరుకుంది.

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

L&T, Lupin, Cipla, Welspun India, Bharti Airtel, Escorts, Pfizer, Zensar Technologies, JSW Steel .

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 31,906, రెసిస్టెన్స్ లెవెల్ 33,154 గా పరిగణించాల్సి వుంటుంది. అదే విధంగా నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14,416 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,051 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

దేశీయంగా ఎటువంటి సంకేతాలు లేనప్పటికీ అంతర్జాతీయంగా సూచీలు ఆశాజనకంగా ట్రేడవుతున్నాయి కాబట్టి మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *