కాన్సాలిడేషన్లో సూచీలు?కలిసొచ్చిన సానుకూలతలు

దేశీయ, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో వరుసగా నాలుగో రోజు కూడా నష్టాల్లో మార్కెట్ సూచీలు చతికిలపడ్డాయి. తయారీ రంగం సూచీలు దిగజారడం, బ్యాంకుల మొండి బకాయిలు పెరిగిపోవడం, ఐటీ మరియు ఫైనాన్స్ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతోపాటు మిడిసెషన్ నుంచి యూరప్, ఆసియా మార్కెట్ల నుంచి అందుకున్న సంకేతాలతో నష్టాల్లో ముగిశాయి. ఇదిలావుంటే అమెరికా మార్కెట్లు తిరిగి రికవరీ అయ్యి లాభాల్లో పయనిస్తున్నాయి. యూస్ జాబ్ డేటా నేడు వెలువడే అవకాశాలున్నాయి. ఇక దేశీయంగా జూన్ నెలలో వాహన విక్రయాలు ఆశించదగ్గ స్థాయిలో మెరుగ్గా వుండటంతో ఆటో మొబైల్ షేర్లలో కొనుగోళ్ళకు మదుపరులు ఉత్సాహం చూపారు. అదే విధంగా భారత ఆర్థిక వ్యవస్థ రికవరీ దిశలో వుందని, తాము ఆశించిన స్థాయి కంటే మెరుగ్గా గత మే నెల నుంచి రికవరీ బాట పట్టిందని రిజర్వుబ్యాంకు గవర్నర్ శక్తికాంత్ దాస్  చేసిన వ్యాఖ్యలు మదుపరుల్లో పాజటివ్ అవుట్ లూక్ క్రియేట్ చేయవచ్చు.  ఈ రోజు ఆసియా మార్కెట్ల సూచీలు లాభాల్లో ఆరంభం అవ్వడంతో సింగపూర్ నిఫ్టీ కాన్సాలిడేషన్లో లాభాల్తో సూచీలు కదలాడుతున్నాయి. వీటి నేపథ్యంలో ఈ రోజు మార్కెట్ లో సూచీలు లాభాల్లో ట్రేడ్ అయ్యే అవకాశాలున్నాయి.

న్యూస్ స్టాక్స్:

టీసీఎస్: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) లండన్ కి చెందిన అతిపెద్ద మ్యూచువల్ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు పెట్టుబడి సంస్థ తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా పెన్షన్ ప్లాట్‌ఫాం ఎస్టేట్‌ను మార్చడానికి మరియు సభ్యులకు మరియు వినియోగదారులకు మార్కెట్ పరమైన సాఫ్ట్వేర్ ఆధారిత సేవలను అందించడంలో వారికి సహాయపడుతుంది.

ఎల్ అండ్ టి: లార్సెన్ & టౌబ్రో (ఎల్ అండ్ టి) నిర్మాణ విభాగం వివిధ విభాగాలలో గణనీయమైన ఆర్డర్‌లను (రూ. 1,000-2,500 కోట్ల పరిధిలో) పొందినట్లు సంస్థ ప్రకటించింది. ఈ ఆర్డర్లలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లోని జల్ జీవన్ మిషన్ కింద గ్రామీణ నీటి సరఫరా ప్రాజెక్టులను అభివృద్ధి చేయడంతోపాటు ముంబైలో (ముంబై) లో రెసిడెన్షియల్ టవర్లు నిర్మాణా ప్రాజక్టులు తాము దక్కించుకున్నమని సంస్థ తెలిపింది.

అఫ్లే (ఇండియా): ప్రముఖ ఐటీ సంస్థ అఫ్లే ఇండియా గ్లోబల్ ప్రోగ్రామాటిక్ మొబైల్ మార్కెటింగ్ సంస్థ జాంప్ప్ కొనుగోలును పూర్తి చేసింది.

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Tata Motors, Alembic Pharma, TCS, Coforge, NCC, NMDC, Coal INDIA

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 34,450, రెసిస్టెన్స్ లెవెల్ 34,980గా పరిగణించాల్సి వుంటుంది. అదే విధంగా నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 15,650 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,770 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *