ఊగిసలాట మధ్య సూచీలు? సానుకూలంగా గ్లోబల్ మార్కెట్లు

దేశీయంగా, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు అందడంతో గురువారం నిఫ్టీ గరిష్ఠ స్థాయిల వద్ద ముగిసింది. ఇదిలావుంటే రిజర్వు బ్యాంక్ ఇండియా విడుదల చేసిన 2020-21 వార్షిక నివేదికలో జీడీపీ అంచనాలపై కోత విధించడంతోపాటు, స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయిలో పెరుగుతున్న తీరుతెన్నులపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెకండ్ వేవ్ ప్రభావం తప్పక వుంటుందని ఉద్ఘాటించింది. ఈ పెరుగుదల నిలబడకపోవచ్చనే అనుమానాలు వ్యక్తం చేసింది. ఇక చూస్తే అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా లాభాల్లో ముగిశాయి. అమెరికాలో నిరుద్యోగ రేటింగ్ డేటా లో క్షీణత వుండటంతో ఈ దఫా అమెరికాలో ప్రత్యేక బడ్జెట్ సుమారు రూ.430 లక్షల కోట్ల బడ్జెట్ వుంటుందన్న వార్తలతో యూస్ మార్కెట్లు సానుకూలంగా ముగిశాయి. ఈ రోజు మన మార్కెట్లు సానుకూలంగా ఊగిసలాట మధ్య ట్రేడ్ అయ్యే అవకాశాలున్నాయి.

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

3M IndiaAditya Birla FCentral Bank
Deepak FertDilip BuildconGlenmark
GMM PfaudlerIndia NipponIndian Bank
Ipca LabsNazaraM&M

 

న్యూస్ స్టాక్స్:

కళ్యాణ్ జ్యువెలర్స్: కళ్యాణ్ జ్యువెలర్స్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 54 శాతం పెరిగి రూ .73.9 కోట్లకు పెరిగింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 42.78% YOY పెరిగి రూ.3,050.60 కోట్లకు చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో 21 షోరూమ్‌లను ప్రారంభించే ప్రణాళికను కల్యాణ్ జ్యువెలర్స్ ప్రకటించింది.

కాడిలా హెల్త్‌కేర్: కాడిలా హెల్త్‌కేర్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం రూ .679 కోట్లకు 73.25% పెరిగింది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 28.7% పెరుగుదలను కనబర్చింది. మార్చి 31, 2021 (ఎఫ్‌వై 21) తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 81.34 శాతం పెరిగి 2,133.6 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ సందర్భంగా కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు 3.5 రూపాయల తుది డివిడెండ్‌ను సిఫారసు చేసింది.

డిక్సన్ టెక్: డిక్సన్ టెక్నాలజీస్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 60% రూ .44.3 కోట్లకు పెరిగింది. డిక్సన్ టెక్ యొక్క కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగం క్యూ 4 లో ఆదాయం మూడు రెట్లు పెరిగి రూ.1,178.6 కోట్లకు చేరుకుంది. కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు రూ .1 చొప్పున తుది డివిడెండ్‌ను ఆమోదించింది.

సన్ ఫార్మా: సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం రూ .884 కోట్లకు 123.6% పెరిగింది. మార్చి 31, 2021 (ఎఫ్‌వై 21) తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 22.8 శాతం తగ్గి 2,903.82 కోట్లకు చేరుకుంది. ఫార్మా కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు రూ .2 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది.

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

M&M, Lupin, Sun Pharma, Ipca Labs, Dilip Buildcon.

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 34,880, రెసిస్టెన్స్ లెవెల్ 35,338 గా పరిగణించాల్సి వుంటుంది. అదే విధంగా నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 15,270 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,398 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలున్నాయి కాబట్టి మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *