ఆశావహంగా ఆసియా మార్కెట్లు…లాభాల్లోకి నిఫ్టీ?

అంతర్జాతీయ ప్రతికూలతల కారణంగా ముఖ్యంగా చైనా తీసుకొచ్చిన చట్టాలు కార్పొరేట్ కంపెనీలకు రుచించకపోవడంతో టెక్ షేర్లలో భారీ అమ్మకాలు తలెత్తడంతోపాటు అమెరికాలో ఫెడ్ పాలసీ నిర్ణయాలు వెలువడనున్న నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు గత కొన్ని మూడు రోజులుగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. దీంతో యూఎస్ మార్కెట్లు సైతం నష్టాల్లోనే ముగిశాయి. అదే విధంగా విదేశీ ఇన్వెస్టర్లు సైతం కొనుగోళ్ళ కంటే విక్రయాలకే మొగ్గు చూపడంతో మన మార్కెట్లకు నష్టాలు తప్పడం లేదు. ఇదిలావుంటే షాంఘై మార్కెట్లు కోలుకోవడంతో ఈ రోజు ఆసియా మార్కెట్లు లాభాల్లో ఆరంభ మయ్యాయి. దీంతో సింగపూర్ నిఫ్టీ లాభాల్లో కొనసాగుతుంది. మన మార్కెట్లకు ఈ రోజు మంత్లీ, విక్లీ డెరివేటివ్ కాంట్రాక్టుల ఎక్సపయిరీ  ఉండటంతో సూచీలు ఒడుదుడుకుల మధ్య ట్రేడ్ కొనసాగుతూ అంతర్జాతీయంగా అందుకునే సంకేతాలతో లాభాల్లో కొనసాగే ముగిసే అవకాశాలున్నాయి.

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

Ajanta PharmaTVS MotorColgate
Deepak NitriteDhanuka AgritecJK Lakshmi Cement
Laurus LabsPVRTech Mahindra

 

న్యూస్ స్టాక్స్:

మారుతి సుజుకి: మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ జూన్ తో ముగిసిన త్రైమాసికంలో (క్యూ 1 ఎఫ్‌వై 22) నికర లాభం రూ .440.8 కోట్లుకు పడిపోయింది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 62% తగ్గింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో (క్యూ 1 ఎఫ్‌వై 21) రూ .249 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం క్యూ 1 ఎఫ్‌వై 22 లో 26% శాతం తగ్గి 17,770 కోట్ల రూపాయలకు పడిపోయింది.

నెస్లే ఇండియా: జూన్ తో ముగిసిన త్రైమాసికంలో (క్యూ 2 ఎఫ్ వై 21) నికర లాభం రూ. 538.6 కోట్ల నికర లాభం 11% పెరిగింది. ఇదే త్రైమాసికానికి సంబంధించి సంస్థ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 14% పెరిగి 3,476 కోట్ల రూపాయలకు చేరుకుంది.

శిల్పా మెడికేర్ : శిల్పా మెడికేర్ టెనోఫోవిర్ డిసోప్రొక్సిల్ ఫ్యూమరేట్ ఔషధం కొరకు WHO ఆమోదం పొందింది. దీర్ఘకాలిక హెపటైటిస్ బి చికిత్సకు మరియు హెచ్ఐవి ఎయిడ్స్‌ను నివారించడానికి మరియు చికిత్స చేయడానికి ఈ ఔషధాన్ని ఉపయోగిస్తారు.

కోఫోర్జ్ : ప్రముఖ ఐటీ సంస్థ కోఫోర్జ్ జూన్తో ముగిసిన త్రైమాసికంలో (క్యూ 1 ఎఫ్‌వై 22) నికర లాభం రూ .123.6 కోట్లతో 54.7 శాతం పెరిగింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 38.3% పెరిగి 1,461.6 కోట్ల రూపాయలకు చేరుకుంది. వచ్చే 12 నెలల్లో ఎక్జిక్యూటబుల్ ఐటి కంపెనీ మొత్తం ఆర్డర్ బుక్ 2021 జూన్ 30 నాటికి 38.7% పెరిగి 645 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ సందర్భంగా కోఫోర్జ్ లిమిటెడ్ బోర్డు ప్రతి షేరుకు 13 రూపాయల మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది.

వెల్‌స్పన్ ఇండియా: వెల్‌స్పన్ ఇండియా లిమిటెడ్ 343.12 శాతం వృద్ధిని సాధించింది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 67.2% పెరిగింది. దీని మొత్తం ఆదాయం 83.15% YOY పెరిగి 217.53 కోట్లకు చేరుకుంది.

మహానగర్ గ్యాస్: నికర లాభం 351% పెరిగి 204 కోట్ల రూపాయలకు చేరుకుంది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 4% తగ్గింది. సంస్థ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 140% శాతం (YOY ) పెరిగింది ఎంజిఎల్ సిఎన్‌జి అమ్మకాలలో 22.5% శాతం తగ్గి క్యూ 1 లో 141.11 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లకు (ఎంఎస్‌సిఎం) నమోదు చేసింది.

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

MGL, COFORGE, Shilpa Medicare, Laurus Labs, JSW Steel, MarutiSuzuki(Sell)

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 34,400, రెసిస్టెన్స్ లెవెల్ 34,700 గా పరిగణించాల్సి వుంటుంది. అదే విధంగా నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 15,645 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,780 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *